Mango Peel Tea Uses: మామిడి తొక్కల టీ గురించి మీకు తెలుసా? దీని వల్ల కలిగే బెనిఫిట్స్ తెలుస్తే అసలు వదలరు!
Mango Peel Tea Benefits: వేసవికాలం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ఈ పండులో బోలెడు పోషకాలు, ఆరోగ్యలాభాలు ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే మామిడి పండు మాత్రమే కాకుండా దీని తొక్కలో కూడా పుష్కలకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Mango Peel Tea Benefits: సమ్మర్ లో మామిడి పండ్ల రుచి చూసి తొక్కలు పారేస్తున్నారా? ఆపండి! ఎందుకంటే ఆ తొక్కల్లో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. షుగర్ నియంత్రణ నుంచి రోగనిరోధక శక్తి పెంపు వరకు మామిడి తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మామిడి తొక్కలు ఒంటే వ్యర్థం కాదు.. వాటిలో విటమిన్లు (A, C, K), పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యాంగిఫెరిన్ అనే ప్రత్యేకమైన కాంపౌండ్ వల్ల ఇన్సులిన్ సమతుల్యత మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. అయితే ఈ మామిడి తొక్కతో తయారు చేసే టీ ను ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. దీని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
మామిడి తొక్క టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మామిడి తొక్కటీ తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మ్యాంగిఫెరిన్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది, గ్లూకోజ్‌ను శరీర కణాలు గ్రహించడానికి సహాయపడుతుంది. ఈ టీ తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాని నివారిస్తుంది. మామిడి తొక్క టీ జీర్ణక్రియను మెరుగుపరిచి శరీర జీవక్రియను పెంచుతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మామిడి తొక్క టీ ఎంతో సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో మేలు చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మానికి మేలు చేయడంలో మామిడి తొక్క టీ ఎంతో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి హాని కలింగే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడానికి ఉపయోగపడుతాయి. దీని వల్ల ముఖంపైన ముడతలు, మచ్చలు వంటి సమస్యలు దూరం అవుతాయి.
మామిడి తొక్క టీ తయారీ విధానం:
ముందు ఒక మామిడి తొక్కను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోయాలి. ఒక గిన్నెలో నీరు పోసి మరిగించాలి. మరిగే నీటిలో మామిడి తొక్క ముక్కలు వేసి 5-10 నిమిషాలు ఉడికించాలి. వడగట్టి, రుచికి తగినంత తేనె లేదా నిమ్మరసం కలిపి ఆరోగ్యకరమైన మామిడి తొక్క టీని ఆస్వాదించండి. మామిడి తొక్క టీ రోజువారీ టీగా తాగడానికి సురక్షితమైనది, రుచికరమైన ఎంపిక.
గమనిక: మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, మామిడి తొక్క టీ తీసుకొనే ముందు వైద్యులు సలహా తీసుకోవడం చాలా మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి