Sprouted Peanuts: పల్లీలను మొలకెత్తించి తినడం వల్ల కలిగే అద్భుత లాభాలు తెలుసా..?
Sprouted Peanuts Benefits: పల్లీలు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో పాటు, చాలా రుచికరంగా ఉంటాయి. కానీ వాటిని మొలకెత్తించి తినడం వల్ల మరింత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Sprouted Peanuts Benefits: పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనకు తెలుసు. వాటిని వంటల్లో, చట్నీల్లో, లేదా వేయించి, ఉడికించి తినడం చాలా మందికి ఇష్టం. కానీ వాటిని మొలకెత్తించి తినడం వల్ల మరింత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన పల్లీల వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మెలకెత్తిన పల్లీల లాభాలు:
మొలకెత్తిన పల్లీలలో మంచి కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి, చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. పల్లీలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపరచడంలో, కడుపు నిండిన భావాన్ని కలిగించడంలో సహాయపడతాయి. మొలకెత్తిన పల్లీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన పల్లీలలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే మొలకెత్తిన పల్లీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. జింక్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, జుట్టును మెరిసేలా చేయడానికి సహాయపడతాయి. మొలకెత్తిన పల్లీలలో ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో, నీరసం, అలసటను నివారించడంలో సహాయపడతాయి. మొలకెత్తిన పల్లీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యాలకు గురికాకుండా సహాయపడుతాయి.
మీరు కూడా ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని వైద్యులు చెబుతున్నారు. అయితే వీటిని ఎలా తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
మొలకెత్తిన పల్లీలను ఎలా తినాలి:
పల్లీలను 8 గంటల పాటు నీటిలో నానబెట్టండి.
నీటిని వదిలివేసి, పల్లీలను మూతలేని పాత్రలో ఉంచండి.
ప్రతిరోజూ నీటితో తడిపి, మొలకెలు మొలకెత్తే వరకు (2-3 రోజులు) ఉంచండి.
మీకు ఇష్టమైన విధంగా వాటిని తినండి.
చిట్కాలు:
మొలకెత్తిన పల్లీలను సలాడ్‌లు, సూప్‌లు, కూరలు లేదా స్నాక్‌గా తినవచ్చు.
వాటిని మరింత రుచికరంగా చేయడానికి మీరు వాటిని కాల్చవచ్చు, వేయించవచ్చు లేదా ఉడికించవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి