Side Effects Of Soybean: సోయాబీన్‌ను ప్రపంచవ్యాప్తంగా వివిధ డిష్‌లలో ఉపయోగిస్తారు. సోయాబీన్‌లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్‌ కొంటెంట్‌ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. అయితే కొన్ని సార్లు సోయాబీన్‌ను అధికంగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశలు ఉన్నాయి. అందులో పురుషులకు సోయాబీన్‌ అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కలుగుతాయి. అయితే సోయాబీన్ వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోయాబీన్  ప్రయోజనాలు:


సోయాబీన్‌లో ఎక్కువగా ఫైబర్, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె సంబంధిత జబ్బుల బారిన పడకుండా ఉంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా సోయాబీన్‌లో ఉండే కొన్ని పదార్థాలు క్యాన్సర్‌ ప్రమాదన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సోయాబీన్ లోని స్పెర్మ్ కౌంట్, మొబిలిటీని పెంచడంలో సహాయపడే పోషకాలు ఉన్నాయి. సోయాబీన్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి మంచివి. ప్రోటీన్, ఫైబర్ బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ సోయాబీన్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. 


సోయాబీన్ వల్ల కలిగే నష్టాలు:


సోయాబీన్ ఆరోగ్యానికి మంచిదైన కొన్ని సార్ల వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ముఖ్యంగా సోయాబీన్‌లోని  ఫైటోఈస్ట్రోజెన్లు పురుష హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేయవచ్చు చెబుతున్నారు పరిశోధకులు. మరికొంత మందిలో అయితే అలెర్జీ ఉండవచ్చు. సోయాబీన్‌లోని ఫైటేట్స్‌ కొన్ని మినరల్స్‌శోషణను ప్రభావితం చేయవచ్చు. కొన్నిసార్లు  థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యలను కూడా కలిగిస్తుంది కాబట్టి మితంగా తీసుకోవడం చాలా మంచిది. దీనితో తయారు చేసిన సోయా ప్రొటీన్ కూడా మార్కెట్‌లో లభిస్తుంది. కాల్షియం, ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, జింక్ ఐరన్ వంటి అన్ని అవసరమైన పోషకాలు సోయాబీన్‌లో ఉంటాయి. అయితే, నిపుణుల సలహా లేకుండా దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల లైంగిక జీవితంపై హానికరమైన ప్రభావం ఉంటుంది. మరీ అధికంగా వీటిని తీసుకోవడం వల్ల పురుషాంగం కుదించబడటం లైంగిక ప్రేరేపణను తగ్గిస్తుంది. కాబట్టి, వైద్యులను సంప్రదించకుండా సోయాబీన్‌ను ఎక్కువగా ఉపయోగించవద్దు. ఆరోగ్యనిపుణుల సలహా లేకుండా ఇలా చేయడం వల్ల మీ సెక్స్ జీవితంపై  తీవ్ర ప్రభావం పడుతుంది.


గమనిక: 


పురుషులు సోయాబీన్ అధికంగా తీసుకుంటే కొన్ని సాధ్యమైన ప్రయోజనాలు, నష్టాలు ఉన్నాయి. మీరు సోయాబీన్ ఎక్కువగా తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లయితే, మీ వైద్యుడితో మాట్లాడటం మంచిది. ఈ సమాచారం సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహా కోసం వైద్యుడిని సంప్రదించండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి