Don't Do These Mistakes In Reading: క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ కోసం చదువుకునే విద్యార్థులు, మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో పైకి ఎదగాలి అని ఆరాటపడే వారు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేసి జీవితానికి సరిపడ మూల్యం చెల్లించుకుంటుంటారు. ఆ క్రమంలో కొన్నిసార్లు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు.. లేదంటే సాధించిన లక్ష్యాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆ తప్పిదాలు ఏంటో తెలిస్తే వాటిని కావాలని ఎవ్వరూ చేయరు. అందుకే అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక ప్లాన్ లేకుండా చదవడం :
ఒక ప్లాన్ లేకుండా చదవడం అనేది నిరూపయోగం అవుతుంది. పైగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అది అంతగా ఉపయోగపడదు. అందుకే ముందుగా మీరు ఏం చదవాలనుకుంటున్నారు ? ఎంత పోర్షన్ చదవాల్సి ఉంది ? అది పూర్తి చేయడానికి మీ వద్ద ఎంత సమయం ఉంది అనే అంశాలపై ఒక అవగాహనకు రండి. ఆ తరువాత ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుని చదవండి.. మీరు అనుకున్న లక్ష్యం తప్పక నెరవేరుతుంది.


బెడ్‌పై పడుకుని చదవడం :
చదువుకునే వారికి ఉండకూడని అలవాట్లలో బెడ్‌పై పడుకుని చదవడం కూడా ఒక ఒకటి. ఇలా చేయడం వల్ల మీరు మీ చదువుపై అంతగా ఏకాగ్రత పెట్టలేరు. అందుకే మీ గదిలో ఒక టేబుల్, దాని పక్కనే ఒక కుర్చీ ఏర్పాటు చేసుకోండి. కుర్చీపై కూర్చుని చదువుకుంటే మీ ఏకాగ్రత పెరిగి మీరు చదివింది తలకెక్కుతుంది.


ఫోన్ పక్కనే పెట్టుకోవడం : 
చదువుకునే సమయంలో ఫోన్ పక్కనే పెట్టుకుంటే పదేపదే దృష్టి చేతికి అందుబాటులో ఉన్న ఫోన్ పై పడే ప్రమాదం ఉంటుంది. అలా మీకు తెలియకుండానే సమయం వృథా అయిపోతుంది. అందుకే మీ ఫోన్ వీలైనంత దూరంలో పెడితే మంచిది. 


రీడింగ్ టేబుల్ పై చెత్తా చెదారం :
మీ రీడింగ్ రూమ్‌లో ఏర్పాటు చేసుకున్న టేబుల్‌పై ఎలాంటి అనవసర వస్తువులు, ఇతర చెత్తాచెదారం లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే మనసు వాటిపైకి దృష్టి మరలి మీ ఏకాగ్రత దెబ్బతింటుంది.


గ్యాప్ లేకుండా చదవడం : 
గ్యాప్ లేకుండా చదవడం సరికాదు. హ్యూమన్ బ్రెయిన్ సగటున 3 గంటల కంటే ఎక్కువ సమయం చురుకుగా పనిచేయదు అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ప్రతీ 2 లేదా 3 గంటలకు ఒకసారి మధ్యలో బ్రేక్ తీసుకుని కూర్చున్న చోటు నుండి లేచి అలా బయటికి వచ్చి ఏదైనా వ్యాపకంలో విశ్రాంతి తీసుకోవాలి. లేదా అలా కాసేపు కళ్లు మూసుకుని రిలాక్స్ అవడం, ఇంకా వీలైతే ధ్యానం చేయడం అనేది మంచిది.


సెల్ఫ్ కేర్ లేకుండా చదవడం : 
ఫస్ట్ ర్యాంక్ కోసం ఆరాటపడే కొంతమంది విద్యార్థులు, ఉద్యోగాల కోసం కుస్తీలు పట్టే వారు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పుస్తకాల్లో తలదూరుస్తుంటారు. అది కరెక్ట్ కాదు. సరైన ఆహారం లేకుండా, సరైన నిద్ర, విశ్రాంతి లేకుండా, సరైన లైఫ్ స్టైల్ లేకుండా చేసే ఏ పనిలోనూ మనిషి పూర్తిస్థాయిలో ఏకాగ్రత సాధించలేడు. అది దీర్ఘకాలంలో వారి ఆరోగ్యానికే ప్రమాదం అనే విషయం మర్చిపోవద్దు.


లాస్ట్ మినట్ రీడింగ్ :
కొంతమంది ముందుగా సమయం వృథా చేసి చివరి నిమిషంలో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అది మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి సరిపోయే సమయం కాదని గుర్తుపెట్టుకోండి. లేదంటే మీరు నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని మీరే చిన్నది చేసుకోవడంతో పాటు అది నీరుగారిపోయేలా చేసుకున్న వారు అవుతారు.