Green Chilli Water Benefits: మనం ప్రతిరోజు వంటలో ఉపయోగించే పచ్చిమిర్చి  కేవలం వంటలను రుచికరంగా తయారు చేయడంలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ వాధ్యిగ్రస్తులకు షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌ లో ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.  పచ్చి మిర్చిలో క్యాప్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది వీటికి కారంగా ఉండే రుచిని ఇస్తుంది. క్యాప్సైసిన్‌కు యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చి మిర్చి నీటిని తయారు చేయడానికి ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పచ్చి మిర్చి ముక్కలు వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి తాగాలి. దీని వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.


పచ్చి మిర్చి నీటి ఆరోగ్య ప్రయోజనాలు:


పచ్చిమిర్చి నీళ్లు తీసుకోవడం జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే  కొన్ని ఆరోగ్యకరమైన కెమికల్స్‌ ఆహారాన్ని త్వరగా  జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఉదయం కొవ్వను కలిగించడానికి ఈ  పచ్చిమిర తీసుకోవడం వల్ల చాలా మంచిది. రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా ఈ  పచ్చిమిర్చి నీళ్లు సహాయపడుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఆరోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండేలా రక్షిస్తాయి.  పచ్చిమిర్చి నీళ్ళు చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రించడంలో సయపడుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే  క్యాప్సైసిన్‌  కీళ్లనొప్పి, తలనొప్పి, మొకాళ్ళు నొప్పి వంటి లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.  చర్మ సమస్యలు ఇబ్బంది పడేవారు ఈ పచ్చిమిర్చి నీరు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్‌ సి చర్మంను కాంతివంతంగా, మొటిమలు , మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. 


పచ్చి మిర్చి నీటిని తాగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు:


అతిగా తాగకండి, ఎందుకంటే ఇది కడుపులో మంట, వికారం, వాంతులకు దారితీస్తుంది.


మీకు గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు లేదా జీర్ణ సమస్యలు ఉంటే పచ్చి మిర్చి నీటిని తాగడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి.


గర్భవతి లేదా పాలిచ్చే మహిళలు పచ్చి మిర్చి నీటిని తాగడం మానుకోవాలి.


పచ్చి మిర్చి నీటిని ఖాళీ కడుపుతో తాగకండి.


పచ్చి మిర్చి నీటిని తయారుచేయడం:


ముందుగా 2-3 పచ్చి మిర్చిని చిన్న ముక్కలుగా కోయండి. ఒక గ్లాసు నీటిలో వేసి, 10 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత  ఈ నీటిని వడగట్టి, గోరువెచ్చగా తాగండి.
రుచికి తగినట్లుగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు.


పచ్చి మిర్చి నీటిని తాగడానికి ఉత్తమ సమయం:


ఉదయం ఖాళీ కడుపుతో (ప్రత్యేకంగా సిఫార్సు చేయబడదు)
భోజనం తర్వాత 30 నిమిషాలు
రాత్రి పడుకోవడానికి ముందు 1 గంట


పచ్చి మిర్చి నీటిని ఎంత మొత్తంలో తాగాలి:


రోజుకు ఒక గ్లాసు (250 మి.లీ.) కంటే ఎక్కువ తాగకండి. 


పచ్చి మిర్చి నీటిని తాగిన తర్వాత ఏమి చేయకూడదు:


వెంటనే పడుకోవద్దు. 


చల్లని నీరు లేదా పానీయాలు తాగవద్దు. 


వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయవద్దు.


పచ్చి మిర్చి నీటి  దుష్ప్రభావాలు:


చర్మంపై దద్దుర్లు, దురద రావచ్చు.


శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.


మీరు పచ్చి మిర్చి నీటిని తాగిన తర్వాత ఏవైనా దుష్ప్రభావాలను అనుభవిస్తే, వెంటనే తాగడం మానుకోండి వైద్యుడిని సంప్రదించండి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి