Bottle Gourd Juice Benefits: ఎలాంటి వ్యాధులకైనా ఒకటే రసం.. ప్రతిరోజు గ్లాసెడు తాగితే మీ ఒంట్లో జరిగేది మ్యాజికే..
Bottle Gourd Juice Benefits: ప్రతిరోజు ఒక గ్లాసు సొరకాయ రసాన్ని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు ఎంతగానో సహాయపడతాయి. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Bottle Gourd Juice Benefits In Telugu: చాలామందికి సొరకాయల కూర అంటే ఎంతో ఇష్టం. చాలామంది దీనితో రసాన్ని కూడా చేసుకొని తాగుతూ ఉంటారు. నిజానికి ఈ సొరకాయను భారతదేశంలో సుమారు 5000 సంవత్సరాల క్రితం నుంచి సాగు చేస్తున్నారు. అప్పటినుంచి ఆహారాల్లో దీనిని వినియోగించే వారట. సొరకాయలో విటమిన్స్ తో పాటు ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు సొరకాయతో తీసిన రసాన్ని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇందులో ఉండే కొన్ని ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధి అయినా రక్తపోటును నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ సొరకాయ రసాన్ని ఎలా తాగాలో? ఈ రసాన్ని తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..
1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
సొరకాయ రసం జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. ఎందుకంటే ఇందులో జీర్ణక్రియ ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను సొరకాయ రసం ఎంతగానో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు సహాయపడతాయి.
2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
సొరకాయ రసం విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. కాబట్టి ప్రతిరోజు ఈ రసాన్ని తాగడం వల్ల సులభంగా రోజుగా నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఫ్లూ, జలుబు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
సొరకాయలో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అంతేకాకుండా పొట్టలోని ఆకలిని నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
4. రక్తపోటును తగ్గిస్తుంది:
సొరకాయ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల తగిన మోతాదులో శరీరానికి పొటాషియం అందుతుంది. దీని కారణంగా రక్తపోటు, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పటికే రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ఈ రసాన్ని తాగడం వల్ల సులభంగా నియంత్రించుకోవచ్చు.
5. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
సొరకాయ రసం యాంటీఆక్సిడెంట్లకు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి గుండెను రక్షించడానికి సహాయపడతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించేందుకు, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
6. చర్మానికి మంచిది:
సొరకాయ రసం విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇది చర్మాన్ని స్థితిస్థాపకంగా, యవ్వనంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి