Diabetes Control Tips: నారింజ తొక్కలతో మధుమేహం, బరువు తగ్గడం, తీవ్ర వ్యాధులకు బైబై చెప్పొచ్చు..
Orange Peel For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాను అనుసరించాల్సి ఉంటుంది.
Orange Peel For Diabetes: చాలా మంది పండ్ల తొక్కలను బయట పడేస్తూ ఉంటారు. కానీ వాటిల్లో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల మూలకాలు దాగి ఉంటాయని తెలియదు. ముఖ్యంగా బత్తాయి పండ్ల తొక్కలను బయట పడేసి వాటి లోపలి పదార్థాన్ని తింటూ ఉంటారు. అయితే లోపలి పదార్థం కంటే దానిపైన ఉండే తొక్క భాగం ప్రభావవంతంగా శరీరానికి పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నారింజ తొక్కలలో ఫైబర్, విటమిన్ సి మరియు పాలీఫెనాల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి వీటిని శరీరానికి వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరెంజ్ పీల్స్ ప్రయోజనాలు:
మధుమేహం:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మధుమేహం బారిన పడే వారి సంఖ్యంగా క్రమంగా పెరుగూ వస్తోంది. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి రెంజ్ పీల్స్ వినియోగించాల్సి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
బరువు తగ్గడం:
ఆరెంజ్ తొక్కలను క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకుంటే సులభంగా తగ్గుతారు. అయితే వీటి ఎలా వినియోగించాలని సందేహం కలుగొచ్చు. దీని కోసం ఈ తొక్కలను నీటిలో ఉడకబెట్టి.. వడపోసి టీలా తాగితే శరీరంలో చెడు పదార్థాలు తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ:
మలబద్ధకం, అజీర్ణం, కడుపులో గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నవారికి నారింజ తొక్కలతో చేసిన రసం కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ రసాన్ని ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది.
మెరిసే చర్మం కోసం:
నారింజ తొక్కల వల్ల చర్మానికి కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రసాన్ని ప్రతి రోజూ తీసుకుంటే అనారోగ్య సమప్యలతో పాటు చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే మెరిసే చర్మ కోసం ఇలా చేయండి. నారింజ తొక్కలను ఎండబెట్టి.. వాటిని గ్రైండ్ చేయండి. ఇలా తయారు చేసి పొడిలో తేనె కలిపి ఫేస్ మాస్క్‌ను తయారు చేసుకోండి. దీనిని ముఖాని అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది.
Also Read: 'శ్రద్ధ'ను పోలిన మర్డర్ కేసు నిందితులను పట్టించిన మొబైల్ ఫోన్.. ఇంత ఈజీగా దొరికేశారా
Also Read: శ్రద్ధ'పై అనుమానమే ఇంతదాకా తెచ్చిందా..వేరే వాళ్లతో వెళుతుందనే ఇలా.. కొత్త కోణం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook