Salt Water Benefits For Health: మన శరీరానికి ఉప్పు, నీరు, విటమిన్‌లు ఎంతో అవసరం. వీటి వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే ఏ రూపంలోనైనా నీరు త్రాగడం మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ ఉప్పు నీరు త్రాగడం వల్ల మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కూడా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు మంచినీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్‌ నీరులో చిటికెడు ఉప్పును కలుపుకొని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఉప్పు నీరు మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. జీర్ణ ప్రక్రియను మెరుగుపరుచుతుంది. అంతేకాకుండా ఉప్పు నీరు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు తొలగిపోతాయి. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుచుతుంది. అలాగే ఉప్పు నీరు తీసుకోవడం వల్ల శరీరంతో పాటు చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చర్మంపైన మొటిమలు, మచ్చలు, నల్ల మచ్చలు రాకుండా సహాయపడుతుంది. ఉప్పు నీరు తీసుకొని ప్రతిరోజు ఉదయం పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.  


అధిక బరువు తగ్గించడంలో ఉప్పునీరు ఎంతో మేలు చేస్తుంది. ఉప్పు నీరు జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా, శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడం ద్వారా బరువు నిర్వహణకు పరోక్షంగా సహాయపడుతుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో, మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది, మంచి నిద్రకు ఉప్పునీరు దోహదపడుతుంది.


 ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియాను చంపి, దుర్వాసన, పుళ్ళు, ప్లాక్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉప్పు  నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది, ఇవి నిర్జలీకరణను నివారించడానికి సహాయపడతాయి. అలాగే ఉప్పు నీరు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది.  శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఉప్పు నీరు ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.


ఉప్పు నీరు తయారుచేయు విధానం:


ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చిటికెడు ఉప్పు కలపండి.
బాగా కలపి, ఖాళీ కడుపుతో తాగండి.


గమనిక:


అధిక రక్తపోటు, గుండె జబ్బులు లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఉప్పు నీరు తాగడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.
చాలా ఎక్కువ ఉప్పు నీరు తాగడం వల్ల వికారం, వాంతులు, అతిసారం వంటి దుష్ప్రభావాలు రావచ్చు.
ఉప్పు నీటిని మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి