Dry Skin Problem: ముఖం పొడిబారుతుందా? కలబంద ఇలా అప్లై చేస్తే కాంతివంతంగా మెరుస్తుంది..
Dry Skin remedy with alovera: కలబంద మనందరిలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాక్టర్ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే.
Dry Skin remedy with alovera: కలబంద మనందరిలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాక్టర్ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. కలబంద జెల్ మన చర్మానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని చర్మానికి మాత్రమే కాదు జుట్టు కూడా ఉపయోగిస్తారు. మన స్కిన్ కేర్ రొటీన్ లో కలబంద చేర్చుకోవడం వల్ల ఇందులోని కూలింగ్ గుణాలు మన చర్మానికి తాజాదనాన్ని అందిస్తాయి. చర్మం పొడి బారటం సమస్యతో బాధపడే వారు కలబందని అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
స్కిన్ మాయిశ్చర్..
డ్రై స్కిన్ సమస్యతో బాధపడే వారికి స్కిన్ రఫ్ గా మారిపోతుంది. దీనికి మాయిశ్చరైజ్ తరచూ అప్లై చేయాలి. మంచి పోషకాలు అందించాలి. అయితే ఇలా చేసినా గాని తరచూ ముఖం పొడిబారుతూ ఉంటుంది. అయితే మాయిశ్చరైజర్‌లా కలబందను అప్లై చేసుకోవాలి ఇందులోని హైడ్రేటింగ్ గుణాలు డ్రై స్కిన్ సమస్యకు చక్కని రెమిడి.
చర్మ దురదలు..
ఈ మండే ఎండకాలం చర్మంపై దురద, మంట ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కలబంద అప్లై చేసుకోవడం వల్ల ఇందులోని కూలింగ్ గుణాలు ప్రభావవంతంగా పని చేస్తాయి. చర్మం పై ర్యాష్, దురదలను తగ్గించేస్తుంది. అందుకే మీ స్కిన్ కేర్ రొటీన్‌లో కలంబందను చేర్చుకోండి. మార్కెట్లో వివిధ బ్రాండ్లలో కలబంద జెల్ అందుబాటులో ఉంటాయి. ఇది అన్ని చర్మాలవారికి సరిపోతుంది.
ఇదీ చదవండి: రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోతే ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి.. వెంటనే జాగ్రత్త వహించకపోతే..
యాక్నె..
డ్రై స్కిన్ తో బాధపడే వారికి ఈ యాక్నే కూడా వస్తుంది. ఇలాంటి సమస్యలను ఉన్నవాళ్ళు మంచి కలబందతో చికిత్స అందించవచ్చు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మచ్చలతో సమర్థవంతంగా పోరాడి ముఖానికి కాంతివంతం చేస్తుంది. డ్రై స్కిన్ వల్ల చర్మంపై దురదలు విపరీతంగా కలుగుతాయి. అందుకే ఈ సమస్య ఉన్నవారు కచ్చితంగా కలబందను ఉపయోగించాలి.
ఇదీ చదవండి: రాగి బాటిల్ లో నీరు నిల్వ చేసి తాగితే వేయి ఆరోగ్య ప్రయోజనాలు..
యాంటీ ఏజింగ్..
కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై త్వరగా వృద్ధాప్యా ఛాయలు కనిపించకుండా చేస్తుంది. ముఖానికి మాయిశ్చర్ అందించి చర్మానికి పునరుజ్జీవనం అందిస్తుంది. అంతే కాదు కలబంద ముఖానికి అప్లై చేయడంపై వాళ్ళ ముఖంపై ఉన్న మచ్చలు, గీతాలు తొలగిపోతాయి. దీనివల్ల త్వరగా ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపించవు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి