COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Eat Too Much Salt What Happens: ఉప్పు ఆహారాలకు రుచిని అందించేందుకు సహాయపడుతుంది. ఉప్పులేని చప్పిడి గల ఆహారాలు తినడం చాలా కష్టం..అయితే ప్రస్తుతం చాలా మంది ఉప్పును అతిగా వినియోగిస్తున్నారు. ఇలాంటి వారు తప్పకుండా ఉప్పు గురించి పలు విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉప్పును అతిగా ఆహారాల్లో వినియోగించడం వల్ల అనేక రకాల హానికరమైన వ్యాధుల వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో దీని కారణంగానే చిన్న వయసులో రక్తపోటు సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు గుండె, మూత్రపిండాల వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే వ్యాధులు రావడానికి ఉప్పు ఎలా కారణమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఉప్పు అతిగా వినియోగిస్తే కిడ్నీ సమస్యలు తప్పవా?
అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె వైఫల్యం, కిడ్నీ వ్యాధులు వస్తూ ఉంటాయి. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు (CKD) కూడా వస్తున్నాయి. కాబట్టి ఉప్పును అతిగా వినియోగించుకునేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


కిడ్నీ పేషెంట్స్‌ ఏ ఉప్పు తినాలో తెలుసుకోండి:
కిడ్నీ పేషెంట్స్‌ తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బిపితో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఉప్పు కలిపిన ఆహారాలు తీసుకుంటే వ్యాధి తీవ్ర  29% పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ఉప్పుకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..


ఉప్పు ఎందుకు హానికరం:
ఉప్పులోని ప్రధాన ఖనిజాలలో సోడియం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి దీనిని అతిగా తీసుకోవడం వల్ల కండరాల సంకోచం, నరాలలో సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా కొంతమందిలో కండరాల బలహీనత సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఉప్పును అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter