Raw Mango Health Uses: వేసవికాలంలో చాలా మంది మామిడి పండును తింటారు. ముఖ్యంగా పండు మామిడిని తీసుకుంటారు. దీనిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.  కానీ పచ్చి మామిడి కాయ తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నార. ఇందులో  ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.  పచ్చి మామిడిలో  విటమిన్‌ ఎ, సి, ఇ, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, ఫైబర్‌ ఇతర పోషకాలు ఉంటాయి. అయితే ఆరోగ్యనిపుణులు ప్రకారం పచ్చి మామిడి తీసుకోవడం వల్ల కొన్ని రకాల వ్యాధులు దూరం అవుతాయని చెబుతున్నారు. వైద్యులు ప్రకారం మామిడి కాయలో ఉండే విటమిన్‌ సి కారణంగా రోగనిరోధక శక్తి మెరుగుతుపడుతుంది.దీని వల్ల  అనేక రకాల అంటు వ్యాధులు దూరం అవుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా పచ్చి మామిడి తీసుకోవడం వల్ల గ్యాస్‌, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ వీటిని మితంగా తీసుకోవాలి లేదంటే అనారోగ్య సమస్యలు కలుగుతాయి.పచ్చి మామిడిపండు తింటే ఎముకలు దృఢంగా తయారు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే పచ్చి మామిడి తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఇది వేసవిలో కలిగే హీట్ స్ట్రోక్‌ను తగ్గిస్తుంది. మామిడి పండు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటుంది.  పచ్చి మామిడి పండు ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటాని సహాయపడుతుంది. పచ్చి మామిడిలో ఉండే జీర్ణ ఎంజైములు ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పచ్చి మామిడిలోని విటమిన్ ఎ చర్మానికి మంచిది.చర్మాన్ని తేమగా ఉంచడానికి, మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ముడతలు, మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది. పచ్చి మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి.ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్, స్తన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది. పచ్చి మామిడిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కడుపు నిండిన భావాన్ని కలిగించడం ద్వారా అతిగా తినకుండా ఉండేలా చేస్తుంది.


పచ్చిమామిడి కాయను ఎలా తీసుకోవాలి: 


పచ్చి మామిడిని నేరుగా తినడానికి ఇష్టపడని వారు చట్నీ, జామ్‌, ఊరగాయ తయారు చేసుకోవచ్చు. లేదా పచ్చి మామిడితో పాటు కొంచెం ఉప్పు, కారం వేసుకొని తిన్నవచ్చు. కానీ మామిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు తిమ్మిరి, వాంతులు, సెగగడ్డలు వస్తాయి. కాబట్టి మితంగా తీసుకోవడానికి ఇష్టపడండి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి