Exercises To Lower Cholesterol: గుండె జబ్బుల నుంచి ఇలా సులభంగా విముక్తి పొందండి..!
Exercises To Lower Cholesterol: ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి.
Exercises To Lower Cholesterol: ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా హైబీపీ, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వ్యాయామమే కాకుండా కొన్ని రకాల ఆహారపు అలవాట్లను పాటించాలని వారు సూచిస్తున్నారు. ఎలాంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ వ్యాయామాలు చేయండి:
వేగంగా నడవండి:
శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి.. ప్రతి రోజూ బ్రిస్క్ వాకింగ్ లేదా బ్రిస్క్ వాక్ చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ బ్రిస్క్ వాక్ చేయడం వల్ల శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా గుండె సంబంధిత సమస్యలను దూరం చేసే అవకాశాలున్నాయని వారు పేర్కొన్నారు.
రన్నింగ్:
శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి రన్నింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ కొన్ని కిలోమీటర్లు పరిగెత్తడం వల్ల శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరిగి బరువు నియంత్రణలోకి వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
సైకిల్ తొక్కడం:
కొలెస్ట్రాల్ తగ్గించడానికి.. శరీరంలోని గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ సైక్లింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి రోజూ మూడు కిలోమీటర్లు సైకిల్ తొక్కవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
యోగాసనాలు:
ప్రతిరోజూ యోగాసనాలు వేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం 40 నిమిషాల పాటు యోగా చేయాలని వారు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: India vs South Africa: టీ20 మూడవ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఇండియా ఘన విజయం
Also Read: India vs South Africa: టీ20 మూడవ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఇండియా ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook