Eye Flu Home Remedies: ఎలాంటి ఖర్చు లేకుండా ఐ ఫ్లూ సమస్యకు చెక్.. ఈ మిశ్రమాన్ని రాస్తే చాలు..
Eye Flu Home Remedies: ఐ ఫ్లూ సమస్యలతో బాధపడుతున్న వారు ఖరీదైన వైద్యం కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్ తో సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ హోమ్ రెమెడీస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Eye Flu Home Remedies: కాలం మారుతున్న కొద్ది చాలా రకాల కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి మొదలుకొని ఐ ఫ్లూ దాకా మనుషులను ఎంతో బాధ పెడుతున్నాయి. అయితే వర్షాల కారణంగా భారతదేశ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల వెలుగు చూసిన ఐ ఫ్లూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపై అందరిపై పంజా విసురుతోంది. ఈ ఫ్లూ కారణంగా ఇప్పటికీ చాలామంది తీవ్ర కంటి సమస్యల బారిన పడ్డారు. ఈ అంటువ్యాధి ఎక్కువగా చిన్నపిల్లలలో వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధి బారిన పడిన చిన్న పిల్లల్లో కంటిచూపుకు అంతరాయం కలిగి కంటిపై వాపు ఇతర సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఖరీదైన వైద్యాన్ని చేయించుకోవాల్సిన అక్కర్లేదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొన్ని సింపుల్ టిప్స్ పాటించి ఈ ఫ్లూ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చట. అయితే ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల ఐ ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా
ఈ ఐ ఫ్లూ ఉపశమనానికి సింపుల్ టిప్స్:
గ్రీన్ టీ బ్యాగులు:
మనం తరచుగా గ్రీన్ టీ తాగుతూ ఉంటాము. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభించడానికి గ్రీన్ టీ బ్యాగులను కూడా ఉపయోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఐ ఫ్లూ నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని వారు అంటున్నారు. గోరువెచ్చని నీటిలో ఈ టీ బ్యాగులను నానబెట్టి ఐ ఫ్లూ ప్రభావితమైన కంటిపై ఉంచడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వాపు నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
పసుపు:
ఐ ఫ్లూ సమస్యలతో బాధపడుతున్న వారికి పసుపు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ పసుపులో అధిక మోతాదులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన మిశ్రమాన్ని దూదితో నెమ్మదిగా కంటి చుట్టూ అప్లై చేస్తే సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వాపు సమస్య నుంచి బయటపడవచ్చు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే ఈ రెమెడీని చిన్నపిల్లలకు ఉపయోగించే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత కంటి లోపలికి వెళ్లకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook