coffee after fasting good or bad: నవరాత్రుల్లో ఉపవాసం చేసే వారికి ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపవాసం చేయడం వల్ల శరీరానికి ఎన్నో మేలు జరుగుతాయి. కానీ, ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. చాలా మంది ఉపవాసం చేసిన తరువాత  టీలు, కాఫీలు తాగుతుంటారు. ఇలా చేయడం మంచిదేనా కాదా అనే విషయాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ లేదా కాఫీ తాగవచ్చా?


ఉపవాస సమయంలో చాలా మంది టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే కొంతమంది ఉపవాస సమయంలో టీ, కాఫీలు తగ్గడం మంచిది కాదని చెబుతుంటారు. కానీ ఆరోగ్యనిపుణులు ప్రకారం టీ, కాఫీ తీసుకోవడం మంచిదే. ప్రతి ఒక్కరికీ అనేక నమ్మకాలు ఉంటాయి. టీ, కాఫీ తీసుకోవచ్చా లేదా అనేది వ్యక్తపైన ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఆహారం తీసుకొనే ముందు మితంగా తీసుకోవడం చాలా మంచిది. 


ఉపవాసం ఏం తినాలి?


ఉపవాసం సమయంలో చాలా మంది పండ్ల రసాలు, నీరు తీసుకోవడం మంచిది. కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్లు శరీరానికి శక్తిని అందిస్తుంది. శరీరాన్ని శుద్ధి  చెరుకు రసం తీసుకోవడం వల్ల ఇందులో ఉండే షుగర్‌ లెవెల్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఉపవాస సమయంలో మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఎంతో మేలు కలుగుతుంది. కొంతమంది జీలకర్ర, దాల్చిన చెక్క వాటితో కషాయాలు తయారు చేసుకొని తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. ఉపవాసం సమయంలో యాపిల్‌, ద్రాక్ష వంటి తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. 


ఉపవాసం సమయంలో తీసుకోకూడదు:


ఉపవాసం సమయంలో తీసుకోకూడని ఆహారాలు, పానీయాల ఉన్నాయి. అందులో మొదటిది పిండి పదార్థాలు. చాలా మంది పండగ పూట బియ్యం, గోధుమ, మైదా పదార్థాలు తీసుకుంటారు. వీటి వల్ల కడుపులో ఇబ్బంది కలుగుతుంది. చక్కెర, తేనె, జామ్ వంటి తీపి పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. అలాగే నూనెలు, వెన్న, చీజ్ వంటి కొవ్వు పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. జీర్ణవ్యవస్థలలో ఇబ్బంది కలుగుతుంది. 


ఈ విధంగా కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి కలుగుతుంది. అంతేకాకుండా పొట్ట ఖాళీగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.  అలాగే నిమ్మరసం తాగుతూ ఉండాలి. దీని వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఈ విధంగా ఆహారానికి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.