Figs Side Effects: అతిగా అంజీర్ పండ్లు తింటున్నారా? అయితే చాలా ప్రమాదం!
How Much Fig You Can Eat In A Day: అంజీర్ పండ్లను అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల పంటి నొప్పి, మైగ్రేన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
How Much Fig You Can Eat In A Day: అంజీర్ పండ్లు శరీరానికి చాలా మంచివి..ఎందుకంటే వీటిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ప్రస్తుతం చాలా మంది శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అంజీర్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇందులో పోషకాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే వీటిని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్నే నష్టాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు అతిగా అంజీర్ పండ్లను తినడం వల్ల చాలా రకాల దుష్ర్పభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తినడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంజీర్ ఎప్పుడు తినాలో తెలుసా?:
ఆహారం పదార్థాల్లో అంజీర్ వేసుకుని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది ఎండిన ఆంజీర్‌ను విచ్చలవిడిగా పాలతో పాటు తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో పొట్ట సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
అంజీర్ పండ్ల ప్రయోజనాలు:
❃ అంజీర్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ సమస్యలు దూరమవుతాయి.
❃ ఈ అంజీర్‌లో ఉండే గుణాలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
❃ ఇందులో ఫైబర్ పరిమాణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ పరిమాణాలు అదుపులో ఉంటాయి.
❃ అంజీర్‌లో ఫిసిన్ అనే ఎంజైమ్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి తీవ్ర పొట్ట సమస్యలను కూడా తగ్గిస్తాయి.
❃ ముఖ్యంగా మధుమేహం సమస్యలతో బాధపడేవారికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
రోజుకు ఎన్ని అంజీర్ పండ్లను తినాలో తెలుసా?:
ఆరోగ్య నిపుణులు పేర్కొన్న వివరాల ప్రకారం ప్రతి రోజు 2 నుంచి 3 అంజీర్ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. వీటి కంటే ఎక్కువగా అంజీర్‌ను తీసుకోవడం వల్ల పంటి నొప్పి, మైగ్రేన్, కడుపు నొప్పి, రాళ్ళు, కాల్షియం లోపంతో సహా మన శరీరంలో అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటిని అతిగా తినడం మానుకోవాల్సి ఉంటుంది.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి