Flax seeds: అవిసె గింజలు ఇలా వాడితే మీ జుట్టు ఊడనే ఊడదు.. పొడుగ్గా పెరుగుతుంది..
Flax seeds for lustrous hair growth: అవిసె గింజలు ఎంతో శక్తివంతమైనవి. ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని లభిస్తాయి. ముఖ్యంగా అవిసె గింజల్లో ప్రొటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, సెలీనియం పుష్కలంగా ఉంటాయి.
Flax seeds for lustrous hair growth: అవిసె గింజలు ఎంతో శక్తివంతమైనవి. ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని లభిస్తాయి. ముఖ్యంగా అవిసె గింజల్లో ప్రొటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యకరమైన శరీరానికి ఎంతో అవశ్యకం. అవిసె గింజులు మన డైట్లో చేర్చుకోవడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్యే ఉండదు. అవిసె గింజల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పాడవ్వకుండా కాపాడతాయి. జుట్టును బలంగా మార్చి కుదుళ్ల ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాదు పీహెచ్ స్థాయిలను సమతులం చేస్తాయి. అయితే, అవిసె గింజలు ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు తెలుసుకుందాం.
అవిసె గింజల నూనె..
ఈ అవిసె గింజలతో నూనె తయారు చేయడానికి ముందుగా ఒక రెండు చెంచాల టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, ఒక టవల్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వేసి ఓ నిమిషం పాటు గోరువెచ్చగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లారనివ్వాలి. దీన్ని మన జుట్టు అంతటికీ కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. ఇప్పుడు ఓ టవల్ వెచ్చగా చేసి ఓ అరగంట పాటు జుట్టుకు కట్టుకోవాలి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. దీన్ని వారానికి రెండు మూడు సార్లు చేయాలి. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఇదీ చదవండి: ఇలా చేస్తే 3 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా.. పొడుగ్గా పెరుగుతుంది..
అవిసె గింజల హెయిర్ జెల్..
ఈ అవిసె గింజల హెయిర్ జెల్ తయారు చేయాడానికి పావు కప్పు అవిసె గింజలు, రెండు కప్పుల నీరు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఆ తర్వాత నీరు, అవిసె గింజలు కలిపి వేడి చేసుకోవాలి. ఇది చిక్కగా అయ్యాక అందులో నిమ్మరసం కలపాలి. అప్పుడు జెల్ మాదిరి అవుతుంది. ఆ తర్వాత చల్లారనివ్వాలి. దీన్ని ఓ జార్‌లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని వారానికి ఒకసారి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
ఇదీ చదవండి: శనగపిండితో మచ్చలేని ముఖం.. నిత్యయవ్వనం.. డ్రై స్కిన్ యాక్నేకు చెక్..
అవిసె గింజలు తినండి..
అవిసె గింజలను ఉదయం తీసుకోవాలి. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌్ పుష్కలంగా ఉంటాయి. ఇది వాపు ససమ్యను తగ్గిస్తాయి. అంతేకాదు అవిసె గింజల్లో విటమిన్ బీ కూడా ఉంటుంది. ఇది జుట్టును బలంగా ఆరోగ్యంగా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ ఫ్రీ రాడికల్ సమస్యను తగ్గించి జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి