Food Combination With Eggs: ప్రస్తుతం చాలా మంది ఆహారాల్లో గుడ్లు తింటున్నారు. ఇలా తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా  గుండె పనితీరును కూడా మెరుగుపరుచుతుంది. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ అధిక పరిమానంలో లభిస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అయితే చాలా మంది గుడ్లను తినే క్రమంలో వేరే ఇతర ఆహారాలను కూడా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆహారాలను గుడ్లతో కలిపి అస్సలు తినకూడదు:
సోయా పాలు:

సోయా పాలు మొక్కల ఆధారిత ప్రోటీన్. కాబట్టి ఈ పాలను గుడ్లు తినే క్రమంలో తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ రెండు పదార్థాలను కలిపి తినడం వల్ల శరీరంలో ప్రొటీన్లు వేగంగా పెరుగుతాయి. దీని కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


గుడ్డు, నిమ్మ రసం:
ప్రస్తుతం చాలా మంది  ఆహారం రుచిని పెంచడానికి నిమ్మ రసాన్ని విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా మంచిదనైనప్పటికీ గుడ్లు, నిమ్మ రసం తీసుకోవడం వల్ల గుండె సంబంధింత సమస్యలు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


గుడ్లు, టీ:
గుడ్డును టీతో ఎప్పుడూ తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ ఫుడ్ కాంబినేషన్ మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. ఎందుకంటే టీతో పాటు గుడ్లు తింటే శరీరంలో ప్రొటీన్లు అధిక పరిమాణంలో పెరిగి అనారోగ్య సమస్యలకు దారీ తీసే ఛాన్స్‌ ఉంది.


అరటిపండ్లు, గుడ్లు:
గుడ్లు, అరటిపండ్లను కలిసి తినడం వల్ల శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా పెరుగుతాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం


Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి