Foods for Glowing skin: ముఖానికి ఎన్నో క్రీములు వాడతాం. ఇలాచేస్తే రెట్టింపు గ్లో వస్తుందని అనుకుంటారు. అయితే, దీనికి సరైన డైట్‌ కూడా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు మన డైట్లో తప్పకుండా ఉండాల్సిందే. ఇవి మన చర్మాన్ని పొడిబారకుండా కాపాడతాయి. మీరు ఏ క్రీములు వాడకుండానే ఈ ఫుడ్స్‌ తింటూ సులభంగా బరువు తగ్గిపోతారు. ఇవి మన చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవకాడో..
అవకాడోలో విటమిన్ సీ, ఇ ఉంటుంది. అంతేకాదు ఇందులో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. ఇవి మన ముఖంపై మాయిశ్చర్‌ను నిలపడంలో పనిచేస్తాయి. కొంతమంది తమ డైట్లో అవకాడోను చేర్చుకోరు ఎందుకంటే ఇందులో కొవ్వు శాతం అధికంగా ఉంటుందని అనుకుంటారు. కానీ, ఇది అపోహ. అవకాడోలో ఒమేగా 6 ఉంటుంది. ఇది మనం ఎక్సర్‌సైజులు చేసినప్పుడు ఎనర్జీగా మారుతుంది.  ఇందులో కొవ్వు తగ్గించే ఆయిల్స్‌ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో లెసిథిన్ కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించేస్తాయి. అవకాడోను కొన్ని పండ్లు లేదా చికెన్‌ సలాడ్స్‌లో తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.


ఇదీ చదవండి: ఈ 5 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మీ డైట్లో ఉంటే ఈ సమ్మర్‌లో కూడా బరువు ఈజీగా తగ్గొచ్చు..


చేప..
సాల్మాన్, మెకరల్‌, సార్డైన్స్, అంకోవీస్, ట్రౌట్‌ చేపలు కూడా మన చర్మానికి రెట్టింపు గ్లో తీసుకువస్తాయి. చేపలు మన శరీరంలో కేన్సర్ కణాలు పెరగకుండా వాపు సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మ కణాలను బలంగా మారతాయి. కొన్ని చేపల్లో సెలీనియం ఉంటుంది. ఇది చర్మంపై మాయిశ్చర్‌ను నిలిపి పొడిబారకుండా కాపాడతాయి. అయితే, గ్రిల్, రోస్ట్‌, స్టీమ్‌ చేసిన చేప తినడం మంచిది డీప్‌ ఫ్రై చేసిన చేప అంత ప్రభావవంతంగా పనిచేయవు.


ఆరెంజ్‌, ఎల్లో పండ్లు కూరగాయలు..
కూరగాయలు, పండ్లు రకరకాల రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆరెంజ్‌, ఎల్లో కూరగాయల్లో బీటా కెరోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది సూర్యుని హానికర కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ, సీ కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. స్వీట్‌ పొటాటో, ఆప్రికాట్స్, క్యాప్సికం, మామిడిపండు, గుమ్మడికాయ, బొప్పాయి ఈ రంగుల్లోనే ఉంటాయి.


పాలకూర..
పాలకూర కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇందులో ఐరన్, ఒమేగా 4 పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, బీ, ఇ ఉంటుంది. ఈ ఖనిజాలు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ముఖంపై మాయిశ్చర్‌ నిలిపి ఆరోగ్యవంతం చేస్తాయి. దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. పాలకూరను కూర, పిజ్జా, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.


గింజలు, విత్తనాలు..
గింజలు, విత్తనాలు పోషకాలకు పవర్ హౌజ్. ఇవి మన శరీరంలో శక్తిని అందిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ,బీ,ఇ, అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇది కణాలకు పునరుజ్జీవనం అందిస్తాయి. ఫ్రీ రాడికల్‌ సమస్యలు రాకుండా నివారిస్తాయి. బాదం, వాల్నట్స్‌, జీడిపప్పు, పిస్తా, చియా, సన్‌ఫ్లవర్ సీడ్స్‌ వీటిని టాపింగ్స్‌లో వేసుకుని తీసుకోవాలి. 


ఇదీ చదవండి: మీ బెడ్‌రూంలో లైట్స్‌ ఆఫ్‌ చేసి పడుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!


ఆయిస్టర్స్..
ఆయిస్టర్స్‌లో కూడా జింక్ పుష్కలంగా ఉంటుంది.  ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. చర్మానికి పునరుజ్జీవనం అందించి పొడిబారకుండా కాపాడతాయి.


కొబ్బరినూనె..
కొబ్బరినూనె సహజసిద్ధమైన సన్‌స్క్రీన్‌ మాదిరి పనిచేస్తుంది. కొబ్బరినూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఇది ముఖంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తాయి. మాయిశ్చరైజింగ్‌ గుణాలు ఉంటాయి. కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు ఉంటాయి. ఇది స్కిన్‌కు లోతైన మాయిశ్చర్‌ అందిస్తుంది. కొబ్బరినూనెతో కూడా కొంతమంది వంటలు చేసుకుంటారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి