Frizzy Hair: గ్రే హెయిర్, ఫ్రీజీ హెయిర్‌తో బాధపడుతున్నారా? అరటి తొక్కతో చెక్ పెట్టొచ్చు!
Banana Hair Mask For Frizzy Hair: జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంది వేసవిలో రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగిస్తూ ఉంటారు. నిజానీకి వీటికి బదులుగా ఈ కింది బానానా మాస్క్‌ను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Banana Hair Mask For Frizzy Hair: వేసవిలో జుట్టు సమస్యలు మరింత రెట్టింపు అవుతాయి. అలాగే నేరుగా సూర్యకాంతి తలపై పడడం వల్ల పొడవాటి జుట్టుకు రాలుతూ ఉంటుంది. అలాగే కొంతమందిలో జట్టు ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. దీని కారణంగా జుట్టు మరింత గరకుగా, అందహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంత మందిలో జుట్టు తెల్లగా కూడా మారుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను అతిగా వాడుతూ ఉంటారు. నిజానికి వీటిని అతిగా వినియోగించడం వల్ల భవిష్యత్‌లో అనేక జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటికి బదులుగా కొన్ని ఇంటి చిట్కాలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి ఇంటి చిట్కాలు వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు అందంగా ఉండడానికి, జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అరటి పండుతో తయారు చేసిన హెయిర్ మాస్క్ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే జుట్టు రాలడం కూడా కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. అయితే ఈ అరటి హెయిర్ మాస్క్‌ను ఎలా వినియోగించాలో తెలుసుకోండి.
అరటి పండ్లు హెయిర్ మాస్క్‌కి కావాల్సిన పదార్థాలు:
రెండు అరటి తొక్కలు
3 కప్పుల నీరు
తయారీ విధానం:
ఈ అరటి పండ్ల హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా స్టౌవ్‌ను వెలిగించి చిన్న బౌల్ పెట్టుకుని అందులో నీటిని వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అందులో అరటి తొక్కలను వేసుకుని నీరు సంగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్‌లో నిల్వ చేయాల్సి ఉంటుంది. దీనిని వినియోగించాలనుకునే వారు స్నానం చేసే క్రమంలో షాంపూను వినియోగించే దాని బదులుగా ఈ అరటి స్ప్రేను తలపై చల్లుకుని బాగా మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాగా మసాజ్ చేసిన తర్వాత షాంపూ చేసుకుని నీటితో బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
గ్రే హెయిర్ కోసం అరటిపండు తొక్క హెయిర్ మాస్క్:
ఈ మాస్క్‌ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
2 అరటిపండు తొక్కలు
02 టీస్పూన్ ఉసిరి పొడి
02 టేబుల్ స్పూన్ షికాకాయ్
02 టీస్పూన్ రీతా
02 టీస్పూన్ హెన్నా మెహందీ
తయారీ విధానం:
ముందుగా స్టౌవ్‌పై కప్పు పెట్టుకుని అందులో నీటిని వేసుకుని బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉసిరి పొడి, షికాకాయ్, రీతా, మెహందీ కలిపి పేస్ట్ తయారయ్యేంత వరకు బాగా మరిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 24 గంటల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించాలనుకునేవారు జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో షాంపూతో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా వినియోగిస్తే జుట్టు మరింత మెరుగుపడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి