భారతదేశంలో రూపాయి నోటు ఆవిర్భవించి ఈ రోజుతో వందేళ్లు పూర్తయింది. తొలి రూపాయి నోటు నవంబరు 30, 1917 తేదీన కింగ్ జార్జి 5 చక్రవర్తిగా ఉన్నప్పుడు భారతదేశంలో  చెలామణీలోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రారంభం కాకపోవడంతో.. కేవలం గవర్నమెంటు ఆఫ్ ఇండియా పేరు మీదే ఆ నోటు వాడుకలోకి వచ్చింది. ఈ క్రమంలో రూపాయి నోటుకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    1917లో తొలిసారిగా రూపాయి నోటు వాడుకలోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో నాణెములను ముద్రించడం టంకశాలకు కష్టమవడంతో.. ప్రత్యమ్నాయం కోసం బ్రిటీష్ ప్రభుత్వం ఆలోచించి పేపర్ కరెన్సీ ముద్రించడానికి శ్రీకారం చుట్టింది


  • అయితే 1926లో మళ్లీ నోట్లను రద్దుచేసి, నాణెముల వైపు మొగ్గు చూపింది బ్రిటీష్ ప్రభుత్వం. తిరిగి 1940లో నోట్ల ముద్రణ ప్రారంభించింది. 1940లో ఆ విధంగా పూర్తిస్థాయిలో వాడుకలోకి వచ్చిన రూపాయి నోటు స్వాతంత్య్రం వచ్చాక కూడా చెలామణీ అయ్యింది. 1994లో తొలిసారిగా రూపాయి నోట్ల ముద్రణను ఆపేశారు. తిరిగి 2015లో మళ్లీ ముద్రించడం ప్రారంభించారు.


  • రూపాయి నోటుకి ఒక ప్రత్యేకత ఉంది.. అదేంటో మీకు తెలుసా..దానిపై ఆర్బీఐ గవర్నరు సంతకం పెట్టరు. కేవలం ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం మాత్రమే నోటుపై ఉంటుంది


  • తొలిసారిగా భారత్‌లో రూపాయి నాణెములు చెలామణీలోకి వచ్చాక.. వాటిని వెండితో తయారుచేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వెండి ఖరీదు విపరీతంగా పెరగడం కూడా.. పేపర్ కరెన్సీ వాడుకలోకి రావడానికి కారణమైందని చరిత్రకారులు చెబుతున్నారు.


  • ఇప్పటికి రూపాయి నోటు అనేక డిజైన్లు మారింది. పలు మార్పులకు కూడా నోచుకుంది.