How To Relieve Gastritis Pain Fast: చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడవడం వల్ల పొట్ట సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. దీని కారణంగా చాలా మందిలో మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించండి. కాబట్టి పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి పదార్థాలు వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడుపులో గ్యాస్ ఉంటే వీటిని వినియోగించండి:
1. కొబ్బరి నీళ్ళు తాగండి:

పొట్టలో గ్యాస్ సమస్యలు ఉంటే..తప్పకుండా ప్రతి రోజూ కొబ్బరి నీటిని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోపగడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు పొట్ట సమస్యలున్నవారు 2 నుంచి 3 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది.


2. దోసకాయ తినండి:
దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటి ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి జీర్ణ క్రియను రక్షిస్తుంది. ముఖ్యంగా పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా దోసకాయను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.


3. లెమన్ వాటర్:
గ్యాస్ సమస్యలతో కడుపు నొప్పి వస్తే తప్పకుండా లెమన్ వాటర్‌ను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యవతంగా చేసి పొట్టలోని గ్యాస్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి రోజూ ఒక గ్లాసు లెమన్‌ వాటర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు


Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook