Constipation:మలబద్ధకం పోవాలంటే ఇవి తీసుకోండి!
Constipation Home Remedies: మనలో చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మలబద్ధకం అనేది చాలా సాధారణమైనది. కానీ దీని వల్ల అనేక రకాలు సమస్యలు కలుగుతాయి. దీని నుంచి ఉపశమనం పొందడం కోసం కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Constipation Home Remedies: మలబద్ధకం అనేది సాధారణ జీర్ణ సమస్య, ఇది మలం కష్టంగా లేదా తక్కువగా పాస్ అవుతుంది. ఈ సమస్య అనేక కారణాల వల్ల కలగవచ్చు. మలబద్ధకం కారణంగా పొట్టలో నొప్పి లేదా అసౌకర్యం వంటి భావణ కలుగుతుంది. మలబద్ధకాని మొదటి కారణం తక్కువ ఫైబర్ కంటెంట్ ఆహారపదార్థాలు తీసుకోవడం, నీరు చాలా తక్కువగా తాగడం, వ్యాయామం చేయకపోవడం, యాంటీడిప్రెసెంట్లు, ఐరన్ మందులు తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఎలాంటి వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడ్డానికి కొన్ని రకాల ఆహారపదార్థాలను మన ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో తెలుసుకుందాం.
ఫైబర్ కంటెంట్ అధికంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇది పండ్లు, కూరగాయాలు వంటి వాటిలో పుప్కలంగా దొరుకుతుంది. అయితే ఫైబర్ ఎందుకు అంత ముఖ్యం అంటే ఇది మలాలను మృదువుగా చేస్తుంది, సులభంగా పాస్ చేయడానికి సహాయపడుతుంది. పండ్లలో ద్రాక్ష, పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు, ఆరెంజ్, మామిడి, సీతాఫలాలు, అరటి తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.
పండ్లతో పాటు నట్స్ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా బాదం ఇందులో మెగ్నీషియం, ఫైబర్ ఎక్కవగా ఉంటుంది. అలాగే వాలనట్స్ లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చియా సీడ్స్ ఎంతో మేలు చేస్తాయి. ఇది మలబద్ధకానికి సూపర్ ఫూడ్. ప్రతిరోజు ఉదయం ఒక గాస్ వాటర్‌లో చియా విత్తనాలు కలుపుకొని తీసుకోవడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు మాయం అవుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
వీటిలో పాటు పచ్చి ఆకుకూరలు, కూరగాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పాలకూర, కాలే, బ్రోకొలి, క్యాబేజ్, బీట్‌రూట్, బఠాణీలు, క్యారెట్లు వంటి కాయకూరలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటితో పాటు ఎల్లప్పుడు శరీరానికి తగ్గినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగండి. రాత్రి త్వరగా పడుకొనేందు ప్రయత్నిచండి. దీంతో పాటు వ్యాయామం చేయండి ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రతిరోజు సమయానికి మరుగుదొంగికి వెళ్లడానికి ప్రయత్నించండి.
గమనిక: మీరు మలబద్ధకం సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే, ఒక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.