Giloy Benefits For Male: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది పురుషులు వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో  స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి దాంపత్య జీవితాన్ని గడపలేకపోతున్నారు. అయతే చాలా మంది ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వైద్యులను సంప్రదిస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్‌ లభించే పలు రకాల ఉత్పత్తులను వాడుతున్నారు. అయిన ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో పలు రకాల చిట్కాలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సమస్యల నుంచి తిప్పతీగతో ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ తీగ వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిప్పతీగతో ఈ ప్రయోజనాలు:


హార్మోన్లలో మార్పులు:


తిప్ప తీగ అనేది ఓ సహజ సిద్ధ మూలిక. ఇది పురుషులలో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న లిబిడో అనే హార్మోన్లను పేంచేందుకు కృషి చేస్తుంది.


శరీరాన్ని దృఢంగా చేస్తుంది:


బలహీనంగా ఉన్న పురుషులను తిరిగి ఉత్తేజ పరచడానికి పురుషుల బలాన్ని, శక్తిని పెంచడానికి తిప్ప తీగ సహాయపడుతుంది. ఇందులో శక్తివంతమైన యాంటిడిప్రెసెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేసి  మనస్సును ప్రశాంతపరుస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి, కోపం, చిరాకును తగ్గించడానికి సహాయపడుతుంది.    


స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది:


శుక్రకణాల సంఖ్య తగ్గడం వల్ల సంతాన సమస్యలు ఉత్పన్నమవుతాయి. స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఈ తీగను వినియోగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తీగలో ఉండే గుణాలు  స్పెర్మ్ నాణ్యతను మెరుగు పరిచి.. వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుంది.


 సంతానోత్పత్తిని పెంచుతుంది:


సంతాన సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది ఒక గొప్ప ఔషధంగా పని చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది సంతానోత్పత్తికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కావున ఈ సమస్యలతో బాధపడే వారు తప్పకుండా వైద్యలు సంప్రదించి దీనిని వాడాలి.


ఈ తీగను ఎలా వినియోగించాలి:


1. పురుషులు నిద్రలేచిన తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో చెంచా తీగ పౌడర్ తీసుకోవచ్చు.
2. ఈ తీగను పౌడర్‌ను డికాక్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన


Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook