Ginger Side Effects: అల్లాన్ని వినియోగించే వారికి బ్యాడ్ న్యూస్..ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!
Ginger Side Effects: అల్లాన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగినప్పటికీ..అతిగా తీసుకోవడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు తెలుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Ginger Side Effects In Telugu: భారతీయులు అల్లాన్ని ఆహార పదార్థాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో టీ తయారీలో కూడా వాడతారు. అల్లాన్ని ఆహార పదార్థాల్లో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం చాలా మంది ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయని అతిగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు:
గుండె సంబంధిత సమస్యలు:
అల్లంలో అధిక మోతాదులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లభిస్తాయి. కాబట్టి గుండెకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. అయితే అల్లాన్ని అతిగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొందరిలో గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కంటి చూపు మందగించే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో రక్తపోటు, గుండె జబ్బులు కూడా రావచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
మధుమేహానికి దారి తీయోచ్చు:
అల్లం అతిగా వినియోగించడం వల్ల రక్తంలోని స్థాయిలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే సాధరణ కంటే తక్కువ షుగర్ లెవల్స్ ఉన్నవారిలో మధుమేహం తీవ్రతరమయ్యే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు అల్లాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు అకస్మాత్తుగా పెరగొచ్చు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
తక్కువ రక్తపోటు:
తక్కువ రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు అల్లాన్ని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది. దీని కారణంగా రక్తంలో కూడా మార్పులు రాచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బిపి ఉన్నవారు అతిగా అల్లం తీసుకోకపోవడం చాలా మంచిది.
గుండెల్లో మంట:
కొంతమందిలో అల్లం అతిగా తీసుకునేవారిలో గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వస్తాయి. దీంతో పాటు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను పెంచే ఛాన్స్ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఛాతీ ప్రాంతంలో నొప్పులు కూడా రావచ్చు. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter