COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ginger Tea Vs Ginger Water: అల్లం టీని తాజా అల్లంతో పాటు ఎండిన అల్లంతో కూడా తయారు చేస్తారు. ప్రస్తుతం చాలా మంది అల్లం టీలతో పాటు తాజా అల్లంతో తయారు చేసిన నీటిని కూడా తాగుతున్నారు. ఎందుకంటే అల్లంలో విటమిన్ బి6, మెగ్నీషియంతో పాటు పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా శరీరానికి బోలెడు లాభాలను అందిస్తుంది. 


భారతీయులు ఎక్కువగా అల్లం టీని ఎండు అల్లం పొడితో తయారు చేస్తారు. ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల మెదడు రిఫ్రెష్ అవుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల వికారంతో పాటు ఇతర పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. అయితే ఈ రెండింటిలో ఏ దేనిని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు..ఏయే సమయాల్లో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


అల్లం టీ:
ప్రస్తుతం జింజర్ టీ.. గ్రీన్ టీతో సమానంగా పోటిపడుతోంది.  అల్లం టీలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. కానీ దీనిని అధికంగా తీసుకుంటే ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్టలో గ్యాస్, ఉబ్బరం, ఆందోళన వంటి సమస్యలకు దారీ తీసే ఛాన్స్‌ ఉంది.


జింజర్‌ వాటర్‌:
పొడి అల్లంతో తయారు చేసిన జింజర్‌ వాటర్‌ను ప్రతి రోజు తాగడం వల్ల గ్యాస్‌ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. భారతీయులు ఎండిన అల్లాన్ని సొంఠి అని పిలుస్తారు. దీనితో తయారు చేసిన నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతి రోజు ఈ నీటిని తాగడం వల్ల శరీర బరువు తగ్గుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ నీటిలో తేనెను మిక్స్‌ చేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


తాజా అల్లం నీరు ప్రయోజనాలు:
తాజా అల్లం నీరును ప్రతి రోజు తాగడం వల్ల జలుబుతో పాటు దగ్గు నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా గుండె పనితీరు కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు రక్త నాళాల సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది. అయితే పొడి అల్లం నీరు గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter