పచ్చ బొట్లు (టాటూ) వేయించుకోవడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపొయింది. ముఖ్యంగా టాటూల పట్ల యువత ఇంత క్రేజ్ పెంచుకోవడానికి ప్రధాన కారణం సెలబ్రిటీలు. వారిని చూసే యువతరం వాటిపట్ల ఆకర్షితులు అవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు..!


టాటూల కారణంగా  ప్రేమించే ఆసక్తి, ఆకర్షణ కలుగుతోందట. ఈ నిజాన్ని టైప్ అనే డేటింగ్ ఆప్ ఒక పరిశోధన చేసి వెల్లడించింది. 64 శాతం మగువలు టాటూలు ఉన్న మగవారికి ఇష్టపడతారట. ప్రతి ముగ్గుర్లో ఇద్దరు టాటూ ఉన్నవారిని ఇష్టపడుతున్నారని టైప్ ఆప్ సీఈఓ తెలిపారు. కానీ ఈ శాతం మగవారిలో తక్కువగా ఉంది. మగవారు టాటూ ఉన్న మగువలను కేవలం 39 శాతమే ఇష్టపడుతున్నారని తెలిపింది. ఈ విషయం తెలిసి అమ్మాయిలను ఆకర్శించడానికి  బ్రిటన్ లో యువత టాటూ షాప్స్ ముందు క్యూ కట్టారు.