Glowing skin Tips: ప్రకృతిలో లభించే పూలలో మల్లెపూలకున్నంత అందం, సువాసన మరి దేనికీ ఉండదంటే అతిశయోక్తి కానేకాదు. అందుకే మల్లెలంటే మగువలకు అంత మక్కువ. మల్లెలు మగువల అందాన్ని ఇనుమడింపచేస్తాయి. అదే సమయంలో మల్లెపూలు బ్యూటీ థెరపీ లేదా స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తుంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మల్లెపూలను బ్యూటీ థెరపీ, స్కిన్ కేర్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించడం చాలాకాలంగా ఉన్నదే. చర్మంపై మచ్చలు, రెడ్‌నెస్, స్వెల్లింగ్ సమస్యల్ని మల్లెపూలు దూరం చేస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యల చికిత్సలో ఉపయోగపడతాయి. చర్మ సంరక్షణకు మల్లెపూలతో ఫేస్‌ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..


చర్మ నిగారింపు


మల్లెపూలతో తయారు చేసే ఫేస్‌ప్యాక్ చర్మానికి నిగారింపును అందిస్తుంది. ఇది చర్మాన్ని లోపల్నించి డీటాక్స్ చేస్తుంది. చర్మంపై ఉండే పోర్స్‌ను క్లీన్ చేయడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చర్మాన్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది.


పింపుల్స్, యాక్నే నిర్మూలన


చర్మంపై తలెత్తే యాక్నే సమస్యను తగ్గించేందుకు మల్లెపూల ఫేస్‌ప్యాక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాక్నే సమస్య రాకుండా నియంత్రిస్తాయి. ముఖంపై మృత కణాలు ఏర్పడకుండా నియంత్రిస్తుంది. మృత కణాలు ఎప్పుడైతే నియంత్రించబడ్డాయో సహజంగానే యాక్నే సమస్య తొలగిపోతుంది.


ముడతలు రాకుండా


మల్లెపూల ఫేస్‌ప్యాక్ ముఖానికి రాసినప్పుడు చర్మంలో కొలాజెన్ స్థాయి పెరిగి ముడతలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. స్కిన్ టైటినింగ్‌తో పాటు చర్మం ఎక్కువసేపు తేమగా ఉండేందుకు దోహదపడుతుంది. డ్రై స్కిన్ ఉండేవారికి ఈ ఫేస్‌ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.


ముందుగా మల్లెపూలను తీసుకుని పచ్చి పాలతో కలిపి గ్రైండ్ చేయాలి. ఇందులో కొద్దిగా కేసరి, కొద్దిగా రోజ్ వాటర్, కొద్దిగా కాఫీ పౌడర్ కలపాలి. కాఫీ పౌడర్ స్క్రబ్ కోసం వాడుతారు. ఇప్పుడు అన్నింటినీ కలిపి ముఖానికి రాసుకుని చేత్తోనే తేలిగ్గా మసాజ్ చేసుకోవాలి. ఓ అరగంట ఉంచిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.


Also read: White Hair To Black: వీటి వల్లే నల్ల జుట్టు తెల్లగా మారుతోంది, బ్లాక్‌ హెయిర్‌ కావాలనుకుంటే ఈ 4 అలవాట్లు మానుకోండి చాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook