COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gongura Pachadi New Recipe: ఆంధ్ర వంటకాల్లో గోంగూర పచ్చడి తప్పనిసరి.. దీనిని చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఎంతో ఇష్టపడి తింటే ఉంటారు. ముఖ్యంగా రోటీలు, అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి ఎంతో మధురమైన రుచి అందిస్తుంది. అంతేకాకుండా ఈ పచ్చడిని తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి గోంగూర ఆకుల్లో శరీరానికి కావలసిన విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తుంది కాబట్టి దీనితో తయారు చేసిన పచ్చడిని క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక రకాల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే చాలామంది దీనిని ఎంతో ఇష్టంగా తిన్నప్పటికీ.. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలియదు. నిజానికి ఈ పచ్చడిని ఎంతో సులభంగా తయారు చేయవచ్చు. అన్ని పచ్చళ్ల కంటే ఎంతో సులభంగా తయారు చేసుకునే ప్రాసెస్ ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.



కావలసిన పదార్థాలు:
గోంగూర ఆకులు - 1 కట్ట
ఎండు మిరపకాయలు - 10-12
శనగల పప్పు - 1/4 కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 5-6
ఉప్పు - రుచికి సరిపోతుంది
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/4 టీస్పూన్
కరివేపాకు - కొన్ని రెబ్బలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
చక్కెర - 1 టేబుల్ స్పూన్ (రుచికి తగినంత)
ఆమ్ చూర్ణం - 1/2 టీస్పూన్ (కావలసినంత) 


తయారీ విధానం:
ముందుగా ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి గోంగూర ఆకులను ఒక్కటి ఒక్కటిగా తెంపి ఒక చిన్న బౌల్ లో వేసుకోవాలి ఆ తర్వాత అందులో నీటిని పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన ఆకులను చిన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత శనగపప్పును తీసుకొని ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసుకొని స్టవ్ పై పెట్టి వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయించుకున్న పప్పును గ్రైండర్లో వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. 
ఆ తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిని కూడా బాగా వేయించుకొని ఆదే శనగపప్పులో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
ఇక మరో స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో పచ్చడికి సరిపడా నూనెను వేసుకొని కొంతసేపు వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి బాగా చిటపటలాడనివ్వాలి అన్ని బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి ఆ తర్వాత కోసుకున్న గోంగూర వేసుకొని బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



కరివేపాకు, గోంగూర బాగా వేగిన తర్వాత చిన్న మంటపై మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న శనగపప్పు, మిర్చి పౌడర్ మిశ్రమాన్ని వేసుకుని మరికొద్దిసేపు బాగా కలుపుకొని ఉడికించుకోవలసి ఉంటుంది. 
ఆ తర్వాత ఇదే మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, చక్కెర, ఆమ్ చూర్ణం వేసి బాగా కలపండి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. 
చల్లార్చిన తర్వాత ఈ మిశ్రమాన్నంత గ్రైండర్ గిన్నెలోకి తీసుకొని మిశ్రమంలో మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది. అంతే సులభంగా గోంగూర పచ్చడి రెడీ అయినట్లే. 


చిట్కాలు: 
ఒకవేళ మీ దగ్గర గోంగూర ముదిరినది లేకుంటే చిన్న చిన్న ఆకులు కలిగిన గోంగూరను కూడా వినియోగించవచ్చు. 
ఈ గోంగూర పచ్చడి రెసిపీ రుచిని పెంచుకోవడానికి ఇందులో ఇంగువను కూడా వేసుకోవచ్చు. 
ఈ పచ్చడిని వేడి మీద ఉండంగా కాకుండా కొద్దిగా చల్లార్చి తినడం వల్ల అద్భుతమైన టేస్ట్ పొందుతారు. 
ఈ పచ్చడి తయారీ విధానంలో నూనెకు బదులుగా నెయ్యిని వినియోగిస్తే రుచి వేరే లెవెల్ ఉంటుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.