Green Dosa: ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే గ్రీన్ కలర్ దోశలు.. తిన్నారంటే మళ్ళీ కావాలంటారు!
Green Dosa Recipe: చాలామంది దోశలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఒకే రకమైన దోశలను తినడం వల్ల అప్పుడప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది. ఇలా సులభంగా ఇంట్లోనే పెసర పిండితో దోశలను తయారు చేసుకోండి.
Green Dosa Recipe: దోశ అంటే ఇష్టపడని వారు ఉండరు.. చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే చాలామంది దోశలను వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా హోటల్స్‌లో మసాలా దోశలను చూస్తూ ఉంటాము. అలాగే కొన్నిచోట్ల ఉప్మాతో తయారుచేసిన దోషాలు కూడా ఉంటాయి. మరికొన్ని చోట్లనైతే చీజ్, నెయ్యి వెన్నతో కూడా కారం దోశలను తయారు చేస్తూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా నెయ్యితో తయారుచేసిన దోశ తినేందుకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ దోశ అనేది పూర్వీకుల నుంచి వస్తున్న ఒక పురాతనమైన రెసిపీ దీనికి ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ప్రస్తుతం చాలామంది ఇళ్లలో దోషలను హెల్తీగా తయారు చేసుకోవడానికి వివిధ రకాల పిండిలను వినియోగిస్తున్నారు. ఎక్కువగా కొంతమందైతే ఓట్స్‌తో కూడా దోశలను తయారు చేసుకుంటూ ఉంటున్నారు. మరికొంత మంది అయితే పెసర పిండితో కూడా దోషాలను తయారు చేసుకుంటూ ఉంటున్నారు. నిజానికి ఈ పిండితో తయారుచేసిన దోశలను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. పెసర్లలో ఉండే ఫైబర్ ఇతర పోషకాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా కూడా రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పెసర పిండితో దోశలను ఎలా తయారు చేసుకోవాలో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
పెసర దోశ తయారీకి కావలసిన పదార్థాలు:
1 కప్పు పెసరపప్పు
1/2 కప్పు బియ్యం
1/4 టీస్పూన్ మెంతులు
ఉప్పు రుచికి సరిపడా
నూనె వేయడానికి
తయారీ విధానం:
ముందుగా ఈ దోశలను తయారు చేసుకోవడానికి పెసరపప్పు, బియ్యం కలిపి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి.
నానబెట్టిన పప్పు, బియ్యాన్ని మెత్తగా గ్రైండర్ లో వేసుకొని మిశ్రమంలో బాగా రుబ్బుకోవాల్సి ఉంటుంది.
ఇలా బాగా రుబ్బిన పిండిలో మెంతులు, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ పిండి పిండి చాలా గట్టిగా లేదా చాలా పలుచగా లేకుండా చూసుకోవాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఆ తర్వాత స్టవ్ పై దోశల పెనం పెట్టుకొని నూనె వేడి చేసి, దోశ చెంచాతో పిండిని పలుచగా పరచుకోవాలి.
దోశ రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
వేడి వేడిగా చట్నీ, సాంబార్ తో కలిసి సర్వ్ చేయండి.
చిట్కాలు:
పెసరపప్పును రాత్రంతా నానబెట్టడం వల్ల దోశలు మృదువుగా ఉంటాయి.
పిండిలో కొద్దిగా ఇంగువ వేస్తే దోశల రుచి పెరుగుతుంది.
దోశ చెంచా చాలా వేడిగా ఉంటే, దానిపై కొద్దిగా నూనె రాసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి