Home Made Oil for Hair Loss and White Hair:  ఆధుని జీవనశైలి కారణంగా చాలా మందిలో జుట్టు రాలడం సమస్య సర్వసాధారమైంది. అయితే ఇలాంటి సమస్యలు పురుషులతో పాటు పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు పోషకాల లోపం, ఒత్తిడి, తప్పుడు జీవనశైలేనని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా మంది మహిళల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ఆయుర్వేద గుణాలు కలిగిన అవకాడో నూనెను ప్రతి రోజూ వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవకాడో నూనె ప్రయోజనాలు:
అవకాడో నూనె జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా సహజంగా బలంగా, మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ నూనెలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు జుట్టుకు పోషణనిచ్చి, దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అవకాడో నూనెలో విటమిన్ ఎ, సి మరియు ఇ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ నూనెను వినియోగించడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.


1. ఇలా షాంపూతో కలిపి అప్లై చేయండి:
ఆర్గానిక్‌ షాంపూలో  6 నుంచి 7 చుక్కల అవకాడో ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు మెరిపించేందుకు కూడా సహాయపడుతుంది.


2. హెయిర్ మాస్క్‌తో అవకాడో ఆయిల్‌:
అవకాడో నూనెను ఇంటి చిట్కాలతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌ల్లో కలిపి జుట్టుకు పట్టించాలి. ఇలా పట్టిస్తే జుట్టు సమస్యల సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వెంట్రుకలు కూడా సులభంగా దృఢంగా మారుతాయి. కాబట్టి మీరు ప్రతి వారం వినియోగించే హెయిర్ మాస్క్‌లో ఈ నూనెను వినియోగించాల్సి ఉంటుంది.


3. జుట్టు పెరుగుదలకు:
జుట్టు పెరుగుదలకు అవకాడో నూనె కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు థిక్‌గా చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ నూనెను ప్రతి రోజూ జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాకుండా దృఢంగా చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ నూనెను వినియోగించాల్సి ఉంటుంది.


4. అవోకాడో నూనెను సీరమ్‌గా కూడా వినియోగించాల్సి ఉంటుంది:
అవకాడో నూనెను హెయిర్ సీరమ్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇలా వినియోగించడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్‌లు జుట్టుకు పోషణనిచ్చి అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook