Hair Care Tips: షాంపూతో ప్రతి రోజు తల స్నానం చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Hair Care Tips: జుట్టుకు ప్రతి రోజు షాంపూను పెట్టుకునే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర జుట్టు సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Hair Care Tips: ప్రతి ఒకరి అందం జుట్టుపై ఆధారపడి ఉంటుంది. జుట్టు పొడవుగా, నల్లగా మెరిసేలా ఉంటేనే ముఖం అందగా కనిపిస్తుంది. అయితే ఆధునిక జీవనశైలి, వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్లే చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యల వస్తున్నాయి. దీంతో పాటు కొంతమందిలో తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల మంచి ఫలితాలు పొందినప్పటికీ కొన్ని రోజుల తర్వాత జుట్టు చెడిపోతోంది. అయితే షాంపూ చేయడానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా మీ పాత ఆరోగ్యకరమైన జుట్టును పొందుతారు.
షాంపూ చేయడానికి ముందు ఈ చిట్కాలు పాటించండి:
నూనె రాసుకోవడం:
షాంపూ చేయడానికి ముందు మీ జుట్టుకు తప్పకుండా నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా నూనెను అప్లై చేసి దువ్వెనతో బాగా దువ్వాల్సి ఉంటుంది. ఇలా దువ్విన తర్వాత 2 గంటల తర్వాత జుట్టును శుభ్రం చేయాల్సి ఉంటుంది.
దువ్వాల్సి ఉంటుంది:
షాంపూ చేయడానికి ముందు తప్పకుండా జుట్టును బాగా దువ్వాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత షాంపూను అప్లై చేయడవ వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
ఈ షాంపూలను మాత్రమే వినియోగించాలి:
ప్రస్తుతం చాలా మంది రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా సల్ఫేట్ రహితంగా ఉండే షాంపూలను ఎక్కువగా వినియోగించడం వల్ల జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి.
చల్లని నీటితో మాత్రమే జుట్టును శుభ్రం చేసుకోవాలి:
జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తన స్నానం చేసే క్రమంలో చల్లని నీటితో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు మొదళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
షాంపూను తక్కువగా వినియోగించండి:
ప్రస్తుతం చాలా మంది తలస్నానం చేసే క్రమంలో షాంపూను అతిగా వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించడం మానుకోవడం చాలా మంచిది..ముఖ్యంగా తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook