Hair Blackening Tips: కేశాల సమస్యలో ప్రధానంగా జుట్టు రాలడం, జుట్టు మెరిసిపోవడం, నిర్జీవంగా మారడం ఇలా వివిధ రకాలుగా ఉంటుంది. కేశాల సమస్యకు మార్కెట్‌లో లెక్కలేనన్ని హెయిర్ కేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా ఏ ఒక్కటీ సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోతున్నాయి. ఈ క్రమంలో సహజసిద్ధమైన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవన విధానంలో పిన్న వయస్సుకే జుట్టు తెల్లబడటం ప్రధాన సమస్యగా మారింది. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి ఉంటుంది. కానీ వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యంతో పాటు వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ సమస్య వయస్సుతో సంబంధం లేకుండా ముందే వచ్చేస్తోంది. కేశాలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. చిన్న వయస్సుకే జుట్టు నెరిసిపోవడం, జుట్టు రాలడం, జుట్టు నిర్జీవంగా మారడం వంటివి ఇబ్బంది కల్గిస్తుంటాయి. అయితే ఈ సమస్యలన్నీ ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి కారణంగా ఉత్పన్నమయ్యేవే. అందుకే డైట్‌ను తగినవిధంగా మార్చుకుని కొన్ని చిట్కాలు పాటిస్తే మీ జుట్టును సహజసిద్ధమైన పద్ధతిలో నల్లగా మార్చుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.


జుట్టును సహజసిద్ధ పద్దతుల్లో నల్లబడేలా చేసేందుకు ఉసిరి పొడి అద్భుతంగా దోహదపడుతుంది. ఉసిరి, మెంతి గింజల కాంబినేషన్ ఈ సమస్యకు మంచి పరిష్కారం కాగలదు. ముందుగా మెంతి గింజల్ని, ఉసిరి పొడిని తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. ఇందులో ఆవనూనె వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 21 రోజులు చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి. 


మరో విధానం ఆవాల నూనె. ఆవాల నూనెలో ఉసిరికాయ, మెంతుల పొడి కలిపి జుట్టుకు రాస్తే మంచి ఫలితాలుంటాయి. అయితే క్రమపద్దతిలో వారానికి కనీసం 4 సార్లు రాస్తే 3-4 వారాల్లోనే జుట్టు నల్లబడటం గమనించవచ్చు. 


Also read: Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ను వేగంగా కరిగించే జ్యూస్ ఇదే.. ఈ రసం ప్రతిరోజు తాగితే చాలట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook