కేశ సంరక్షణ, కేశాల సమస్య.. ఈ రెండు తరచూ వినే మాటలు. ముఖ్యంగా మహిళలు ఈ రెండు సమస్యలతో బాధపడుతుంటారు. మరి ఈ సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలి, ఈ సమస్యల్ని నియంత్రించేందుకు చిట్కాలు ఏమున్నాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేశాలకు సంబంధించి డేండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్, డ్రై హెయిర్ సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువౌతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు వివిధ రకాల హెయిర్ ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. కానీ కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల సహాయంతో కేశాల్ని సంరక్షించుకోవచ్చు. కేశాల సమస్యను దూరం చేసేందుకు గ్లిసరిన్ వాడాల్సి ఉంటుంది. గ్లిసరిన్‌లో మాయిశ్చరైజింగ్ గుణాలుంటాయి. దీంతో కేశాలకు తేమ లభిస్తుంది. ఫలితంగా డ్రై హెయిర్ సమస్య పోతుంది. గ్లిసరిన్ రాయడం వల్ల ఏ విధంగా కేశాలు బలంగా మారతాయో తెలుసుకుందాం..


గ్లిసరిన్‌తో కేశాలకు కలిగే ప్రయోజనాలు


ఫ్రీజీ, డ్రై హెయిర్ నుంచి విముక్తి


మీ జుట్టు ఫ్రీజీగా, డ్రైగా ఉంటే గ్లిసరిన్ వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే గ్లిసరిన్ రాయడం వల్ల కేశాల లోపలివరకూ తేమ లభిస్తుంది. ఫలితంగా కేశాల డ్రైనెస్ తగ్గుతుంది. దీనికోసం నీళ్లలో కొద్దిగా గ్లిసరిన్ కలిపి..మీ కేశాలకు అప్లై చేయాలి.  15 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కేశాలు అందంగా, పటిష్టంగా మారుతాయి.


డేండ్రఫ్ సమస్య నుంచి ఉపశమనం


మీ జుట్టులో డేండ్రస్ సమస్యగా ఉంటే..గ్లిసరిన్ వాడకం మంచి ఫలితాలనిస్తుంది. ఎందుకంటే గ్లిసరిన్‌లో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి స్కాల్ప్‌పై బ్యాక్టిరియాను ఉండనివ్వవు. ఫలితంగా మీ తలలో డేండ్రఫ్ సమస్య తొలగిపోతుంది. దీనికోసం కొబ్బరి నూనెలో కొద్దిగా గ్లిసరిన్ కలిపి జుట్టుకు రాసి మస్సాజ్ చేయాలి. 2 గంటలుంచి..ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి.


స్ప్లిట్ ఎండ్స్ నుంచి రక్షణ


కేశాల్ని దీర్ఘకాలం ట్రిమ్ చేయకుండా ఉంటే స్ప్లిట్ ఎండ్స్ సమస్యగా మారతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు నీళ్లలో గ్లిసరిన్ కలిపి రాయాలి. దీనికోసం ఆలివ్ ఆయిల్‌లో కొద్దిగా గ్లిసరిన్ కలిపి కేశాలకు రాయాలి. ఇలా చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ దూరమౌతాయి. కేశాలు పటిష్టంగా మారతాయి.


Also read: Cought At Night Time: రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా ఉంటే..నిర్లక్ష్యం చేయొద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook