Hair Care Tips At Home: జుట్టు పొడవుగా, మెరిసేలా మారేందుకు చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే దీని వల్ల చాలా రకాల దుష్ర్పభాలు కలిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటికి బదులుగా ఇంట్లో లభించే పలు రకాల వస్తువులను వినియోగించి కూడా జుట్టు పొడవుగా చేసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జుట్టుకు శెనగపిండిని అప్లై చేయడం వల్ల జుట్టుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లభించి జుట్టు పొడవుగా, మెరిసేలా సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని జుట్టుకు ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగుతో శెనగపిండిని ఇలా వాడండి:
శనగపిండి,పెరుగును మిక్స్‌ చేసి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేస్తే జుట్టు పొడవుగా, మెరిసేలాగా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే జుట్టు సమస్యలతో బాధపడేవారు శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుంటే జుట్టు పొడవుగా, ఒత్తుగా, మృదువుగా మారుతుంది. అయితే చాలా మందికి దీనిని ఎలా వినియోగించాలో అనే సందేహం కలుగొచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.


శెనగపిండిలో గుడ్లు వాడండి:
శెనగపిండిలో గుడ్లులను మిక్స్‌ చేసి వినియోగించడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయనిచ హెయిర్‌ కేర్‌ నిపుణులు తెలుపుతున్నారు. శెనగ పిండిలో గుడ్లను కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని జుట్టు అప్లై చేయాల్సి ఉంటుంది.  గుడ్లలో అధిక పరిమాణంలో ప్రోటీన్‌ లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రోజూ జుట్టుకు అప్లై చేయడం వల్ల  జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా బలంగా కూడా మారుతుంది. కాబట్టి తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్యలు కూడా దూరమవుతాయి.


Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ


Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook