Hair Care Tips For Long Hair: చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, నెరిసే సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్స్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా వాటిని వినియోగించడం వల్ల  జుట్టు బలహీనంగా మారుతుంది.  అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ క్రింది జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తడి జుట్టును దువ్వెనతో దుయ్యేచ్చా?:
హెయిర్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం.. జుట్టును తడపడం వల్ల మూలాలు  బలహీనంగా మారుతాయి. దీంతో వాటిని దూయడం వల్ల రాలిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టు ఆరిపోయిన తర్వాత దూవ్వాల్సి ఉంటుంది.  జుట్టు బలహీనంగా ఉన్నవారు, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు కూడా తప్పకుండా జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.


ఇలా దువ్వుకోండి:
తలస్నానం చేసిన తర్వాత తలలో నీరు అలానే ఉండిపోతుంది. దీని వల్ల వెంట్రుకలు (వెట్ హెయిర్ కంబింగ్ లాస్) అతుక్కుపోతాయి. ఈ క్రమంలో దువ్వెనను వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొడువు జుట్టు ఉన్నవారు ముందుగా జుట్టును 2 భాగాలుగా చేయాలి. ఆ తర్వాత వాటిని కలపి దువ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి జుట్టు సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.


మీరు రోజుకు ఎన్ని సార్లు దువ్వుకుంటారు:
జుట్టు దువ్వే ముందు పూర్తిగా ఆరబెట్టండి..ఆపై వాటికి నూనె రాయండి. ఇలా చేయడం వల్ల నూనె జుట్టు మూలాలకు చేరుతుంది. దీని వలన జుట్టు పూర్తి పోషణను పొందుతుంది. అంతేకాకుండా అందరూ ప్రతి రోజూ 3 నుంచి 4 సార్లు దువ్వుకోవాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Pawan Kalyan: చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్‌ సపోర్ట్.. వైసీపీ పాలనలోనే ఇలా చూస్తున్నాం..


Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook