Hair Care Tips: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టును వివిధ రకాలు స్టైలలో మార్చుకుంటున్నారు. అయితే ఇలా మార్చుకునే క్రమంలో హానికరమైన ప్రోడక్ట్స్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా మహిళలు జుట్టు నిటారుగా ఉంచడానికి హెయిర్ స్ట్రెయిట్‌నర్ వంటి పరికరాలు వినియోగిస్తున్నారు. అయితే, ఇవి  కొంత సమయం వరకు జుట్టుకు మంచి రూపాన్ని ఇస్తుంది. కానీ హానికలిగిస్తుందని ఎవరు ఊహించరు. హెయిర్ స్ట్రెయిట్‌నర్ ఉపయోగించడం వల్ల జుట్టు పొడిగా మారి..డ్యామేజ్‌కు గురవుతుంది. దాని నుంచి వెలువడే వేడి, జుట్టు యొక్క పోషణను తగ్గించడంతో పాటు, వెంట్రుకలను పొడిగా, నిర్జీవంగా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుకోవాడాని..హెయిర్ స్ట్రెయిట్‌నర్ ఉపయోగించిన తర్వాత పద్ధతులను ఫాలో అవ్వండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


- హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ని ఉపయోగించిన తర్వాత జుట్టు పొడిగా, పాడైపోతుంది. దీని వల్ల జుట్టు అప్పుడప్పుడు విరగడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, జుట్టును కత్తిరించడం మంచిది. ఇలా చేస్తే దెబ్బతిన్న జుట్టును తొలగిపోయి.   జుట్టు మరింత వేగవంతం పెరుగుతుంది.


- హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ని ఉపయోగించడం వల్ల  జుట్టు పొడిగా మారుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎక్కువగా షాంపూ చేస్తూ ఉంటారు. దీని వల్ల హెయిర్‌ మాయిశ్చరైజర్ తగ్గి  జుట్టు పొడిబారుతుంది.


- జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరం. కావున బయటకు వెళ్లే క్రమంలో జుట్టును స్కార్ప్‌ కప్పడం మంచిది.


-  స్విమ్మింగ్ చేసే క్రమంలో క్లోరిన్ నుంచి జుట్టును రక్షించడానికి హెయిర్ క్యాప్ ధరించండి.


- జుట్టు యొక్క తేమను తిరిగి తీసుకురావడానికి మీరు హెయిర్ స్పా దోహదపడుతుంది.


- ఇంట్లోనే డీప్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్‌ని ప్రయత్నించడం ద్వారా జుట్టును తేమగా మార్చుకోవచ్చు.


- హెయిర్ స్ట్రెయిట్‌నర్ ఉపయోగించిన తర్వాత..జుట్టుపై సల్ఫేట్ అదిక స్థాయిలో ఉన్న షాంపూను అస్సలు ఉపయోగించవద్దు.


Also Read: Mulberry For Health: మల్బరీ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!


Also Read: Tips to clean white socks: తెల్లటి సాక్స్‌లు నల్లగా మారుతున్నాయా..అయితే ఈ చిట్కాలను పాటించి శుభ్రం చేసుకోండి.!!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook