COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hair Oil For Hair Fall Control: ఆధునిక జీవనశైలి కారణంగా జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందిరిలోనూ జుట్టు రాలిపోతోంది. అయితే దీని కారణంగా కొంతమందిలోని ముఖం అందహీనంగా తయారవుతోంది. అయితే చాలా మందిలో దుమ్ము, కాలుష్యం, సూర్యరశ్మి కారణంగా కూడా సులభంగా జుట్టు రాలుతోంది. ఈ హెయిర్‌ ఫాన్‌ కంట్రోల్‌ చేసుకోవడానికి మార్కెట్‌లోని రకరకాల రసాయన ఉత్పత్తులు, షాంపూలు, కండిషనర్ల వినియోగిస్తున్నారు. చాలా మందికి వీటిని వినియోగించడం హానికరమని తెలిసినప్పటికీ అతిగా వినియోగిస్తున్నారు. 


ఇలా ప్రతి రోజు రసాయనాలతో కూడిన హెయిర్‌ ప్రోడక్ట్స్‌ అతిగా వినియోగించడం వల్ల జుట్టు డ్యామేజ్‌ మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించి మూడు రకాల నూనెలను ప్రతి రోజు వినియోగించడం వల్ల సులభంగా జుట్టు రాలడం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టుకు పోషణను అందజేసి జుట్టును కుదుళ్ల నుంచి దృఢంగా రక్షిస్తాయి. 


ఈ 3 నూనెలను కలపి అప్లై చేయండి:
జుట్టు రాలడం తగ్గించడానికి కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.  జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషించడమేకాకుండా రీ గ్రోత్‌ కోసం సహాయపడుతుంది. అయితే ఈ కొబ్బరి నూనెలో ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఔషధ గుణాలు కలిగిన నూనెలను మిక్స్‌ చేసి జుట్టుకు అప్లై చేస్తే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే కొబ్బరి నూనెలో ఏయే నూనెలు మిక్స్‌ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


ఈ 3 నూనెలు తీసుకోవాలి:


3 నూనెలు 1/4 కప్పు కొబ్బరి నూనె
1/4 కప్పు కాస్టర్ ఆయిల్
6 చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ 


పైన పేర్కొన్న మూడు నూనెలలను ఒక బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన రెండు గంటల తర్వాత రసాయనాలు లేని షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా జుట్టు రాలడం సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా ఈ మూడింటిని మిక్స్‌ చేసిన నూనెలను వినియోగించి వాడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఊడిపోయిన జుట్టు కూడా సులభంగా తిరిగి వస్తుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook