Hair Fall Oil: తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యలు తగ్గడానికి ఈ నూనె చాలు! 25 రోజుల్లో చెక్..
Coconut Oil For Hair Fall Problem: కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా ఈ సమస్యలున్నవారు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడం సమస్యలను కూడా సులభంగా తగ్గుతాయి.
Coconut Oil For Hair Fall Problem: వాతావరణంలో కాలుష్యం పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చర్మ, జుట్టు సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా తెల్ల జుట్టు సమస్యలు రావడమేకాకుండా జుట్టు రాలడం సమస్యలు కూడా వస్తున్నాయి. వీటి నుంచి ఉపశమనం పొందడానికి అల్లోపతి మందులు వినియోగిస్తారు. వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించి పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాలతో జుట్టు రాలడం తగ్గుతుంది:
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడం, జుట్టు నెరిసిపోవడం వంటి సమస్యల దూరం చేస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్ రికార్డ్స్ ఇవే!
జుట్టు రాలడాన్ని తగ్గించేందు కొబ్బరి నూనె ఇలా వినియోగించండి
జుట్టు నెరిసిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ పదార్థాలను మిక్స్ చేసిన కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూనెను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో 4 టీస్పూన్ల ఉల్లిపాయ రసం కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు రాలడం సమస్యలు దూరమవుతాయి.
మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ముఖానికి కొబ్బరి నూనెను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు ముఖంపై మచ్చలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మడమలు పగిలిపోవడం:
పగిలిన మడమల సమస్యలను తగ్గించుకునేందుకు.. ఒక టీస్పూన్ పెట్రోలియం జెల్లీని ఒక టీస్పూన్ కొబ్బరి నూనెతో మిక్స్ చేసి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని పగిలిన మడమలకు అప్లై చేస్తే సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా మడమలు కూడా మృదువుగా తయారవుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్ రికార్డ్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.