Hair Fall Solution: మారుతున్న కాలానుగుణంగా చాలా మంది తలకు నూనె రాయడం మానేశారు. దీంతో వెంట్రుకలు పొడిగా మారి.. తలలో చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రు కారణంగా తలలో దురద సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యలన్నీ తలకు నూనె రాయకపోవడం వల్లనే వస్తున్నాయని వైద్యనిపుణులు అంటున్నారు. అలా జుట్టుకు నూనె రాయడం వల్ల అలాంటి సమస్యలను నివారించుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నూనె రాసుకున్న తర్వాత జుట్టు ఎందుకు రాలిపోతుందనే ప్రశ్న చాలామందిలో మెదులుతుంది. అయితే దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అయితే నూనె రాస్తున్నా.. జుట్టు ఎందుకు రాలుతుందో కారణాలను తెలుసుకోండి. 


నూనె రాసుకున్న తర్వాత జుట్టు ఎందుకు రాలిపోతుంది?


1) కొందరు పొరపాటున హెయిర్ ఆయిల్ సరైన రీతిలో అప్లే చేయకపోవడం వల్ల జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటారు. వెంట్రుకలకు నూనె అప్లే చేసిన తర్వాత చిన్నగా మసాజ్ చేయాలి. అలా కాకుండా వేగంగా నూనె అప్లే చేయడం వల్ల జుట్టు రాలే అవకాశం ఉంది. 


2) నూనె రాసుకున్న తర్వాత మహిళలు తరచుగా షాంపూతో స్నానం చేస్తున్నారు. లేదంటే పోనీటైల్ వేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలహీనపడుతుంది. 


3) కొందరు వెంట్రుకలను అతిగా నూనె రాస్తుంటారు. అలా చేయడం వల్ల వెంట్రుకలు పెరిగే రంధ్రాలు నూనెతో మూసుకుపోయి.. జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. 


4) వేడివేడి నీళ్లతో తలస్నానం లేదా వేడి నూనెను తలకు అప్లే చేయడం వల్ల జుట్టు రాలే సమస్య రావొచ్చు.   


Also Read: Holi 2022 Celebration: హోలీ సెలెబ్రేషన్స్.. ఒక్క నిమిషంలో 100 బెలూన్స్ నీటితో నింపొచ్చు!


Also Read: Reasons for Back Pain: వెన్నునొప్పితో బాధపడే వారు ఎట్టిపరిస్థితిలోనూ ఈ తప్పులు చేయకండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook