Hair Loss Treatment: జుట్టు రాలడానికి వివిధ కారణాలున్నాయి. పోషకాహార లోపం, అధిక ఒత్తిడితో పాటు మనం జుట్టు సంరక్షణ కోసం వినియోగించే ఉత్పత్తుల వల్ల జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది. వీటితో పాటు జన్యుపరమైన కారకాలతో పాటు అనేక కారణాల వల్ల అధికంగా జుట్టు రాలడం జరుగుతుంది. కానీ, కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించి జుట్టు రాలే సమస్యను నివారించుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం రోజు తాగే టీ.. దాని డికాక్షన్ తో జుట్టుకు మేలు జరుగుతుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరచుకునేందుకు తేయాకు (టీ) నీటిని ఉపయోగించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. దీని వినియోగంతో మీ జుట్టు నిగనిగలాడుతుంది.


తేయాకు నీటి వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు..


1) జుట్టు రాలిపోయే సమస్యను తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో తేయాకు (టీ) నీరు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తేయాకుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. అవి చుండ్రును నివారించడంలో సహాయపడతాయి.


2) మీ జుట్టు నిగనిగలాడాలంటే.. తేయాకు నీటిలో జుట్టును రోజూ కడగాలి. దీని వల్ల మీరు కచ్చితంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా తేయాకు నీరు జుట్టుకు వాడడం వల్ల తేమగా ఉండేందుకు సహాయపడుతుంది. 


3) అంతే కాకుండా తేయాకు నీరు జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. మీ జుట్టును సహజంగా మీరు నల్లగా మార్చుకోవాలంటే.. ఈ తేయాకు నీటిని వినియోగించవచ్చు. 


(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)           


Also Read: Jaggery Tea for Diabetes: షుగర్ పేషెంట్లు బెల్లం టీ తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?


Also Read: Honey Facial Benefits: తేనె వినియోగంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook