Hair Problems And Solutions: ప్రతి ఒక్కరూ అందమైన, బలమైన జుట్టును కోరుకుంటారు. ఆయితే ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు రాలడం, వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా హోం రెమెడీస్ వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పుల ఆరోగ్యరమైన అలవాట్లు కూడా పాటించాలి. అయితే చాలా మంది ఇప్పుడు చేయకూడని పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ కింద పేర్కొన్న పలు పనులను చేయకపోవడం చాలా మంచిదని నిపుణులు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి పనులు అస్సలు చేయోద్దు:
1. జుట్టును తరచుగా దువ్వడం మానుకోండి. ఎందుకంటే ఎక్కువగా దువ్వడం వల్ల మీ జుట్టు బలహీనపడటమే కాకుండా జిడ్డుగా మారుతుంది. చిక్కుబడ్డ జుట్టును విడదీయడానికి మీరు వెడల్పాటి టూత్ దువ్వెనను ఉపయోగించాలి.
2. షాంపూ వాడకాన్ని క్రమంగా తగ్గించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువగా హెయిర్ వాష్ చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది.
3. అంతేకాకుండా చాలా మంది హెయిర్ డ్రైయర్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనిని అతిగా వినియోగించడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.
4. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వుకోవడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల రాలిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా జిడ్డుగా కూడా మారొచ్చు.
5. దువ్వెనలు, స్టైలింగ్ సాధనాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దువ్వెనలు, బ్రష్‌లను కనీసం వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
6.సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి రోజూ సమతుల్య ఆహారం తీసుకోవాలి.


ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రీన్‌ వెజిటేబుల్స్‌ ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్స్‌ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!


ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్‌యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే


ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook