Turmeric Milk Side Effects In Summer: పసుపు, పాలు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు శరీర రోగనిరోక శక్తి కూడా పెరుగుతుంది. అయితే కోవిడ్‌ కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పసుపు, పాలను తాగితే సులభంగా ఉపశమనం పొందొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పసుపులో క్రిమినాశక లక్షణాల ఉంటాయి. కాబట్టి సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ప్రతి రోజూ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అయితే ఈ పాలను అతిగా తాగితే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అతిగా తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి వారు పసుపు పాలు తాగకూడదు:
1. పొట్టలో సమస్యలున్నాయా?:

పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు పసుపు పాలను అస్సలు తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్టలో గ్యాస్‌ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పాలు అతిగా తాగితే తీవ్ర పొట్ట సమస్యలుగా మారే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో కర్కుమిన్ యాక్టివ్ సమ్మేళనం అతిగా ఉంటాయి. కాబట్టి అతిగా తాగితే.. అతిసారం, వాంతులకు కారణమవుతుంది.


2. సంతానం లేని పురుషులు:
తండ్రి కావాలని ఆకాంక్షిస్తున్నవారు ఈ పాలను అస్సలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలను అతిగా తాగితే స్పెర్మ్ నాణ్యత తగ్గే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా సంతానోత్పత్తిపై కూడా ప్రభావవం పడే అవకాశాలున్నాయి. పసుపు పాలను అతిగా తాగితే కాలేయం, పిత్తాశయం వంటి సమస్యలకు దారి తీయోచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పాలను తాగడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


4. గర్భిణీ స్త్రీలు:
గర్భిణీ స్త్రీలు కూడా పసుపు పాలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలు అతిగా తాగడం వల్ల గర్భాశయం సంకోచాన్ని పెంచే ఛాన్స్‌ ఉంది. దీని కారణంగా  రక్తస్రావం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు తాగకపోవడం చాలా మంచిది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు


Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook