Mothers Day 2021 Wishes In Telugu: అందమైన కోట్స్‌తో అమ్మకు మదర్స్ డే విషెస్ ఇలా తెలపండి
Mothers Day Wishes in Telugu : అమ్మను మించిన దైవము లేదు. మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఆమె. తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా బిడ్డను ఈ లోకంలోకి తీసుకొస్తుంది ఆ త్యాగశీలి. కానీ పుట్టిన బిడ్డను తొలిసారి చూడగానే తన ప్రసవ వేదనను మరిచిపోయి సంతోషంలో మునిగి తేలుతుంది అమ్మ. Mothers Day 2021
Mothers Day 2021 Quotes | అమ్మ.. సృష్టిలో ఇంతకంటే అద్భుతమైన, అందమైన పదం మరొకటి ఉండదు. అమ్మను మించిన దైవము లేదు. మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఆమె. తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా బిడ్డను ఈ లోకంలోకి తీసుకొస్తుంది ఆ త్యాగశీలి. కానీ పుట్టిన బిడ్డను తొలిసారి చూడగానే తన ప్రసవ వేదనను మరిచిపోయి సంతోషంలో మునిగి తేలుతుంది అమ్మ. నువ్వు ఏం పని చేసినా, అంద విహీనంగా ఉన్నా, తన బిడ్డే అందరి కంటే ఉత్తమమని, జీవితంలో కచ్చితంగా ఏదైనా సాధిస్తావని నమ్మే తొలి వ్యక్తి అమ్మ మాత్రమే.
తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించి మన జీవితానికి బంగారు బాటలు వేస్తుంది ఆ మాతృమూర్తి. నేడు మాతృదినోవ్సం. Mothers Day 2021ను పురస్కరించుకుని ఇలా అందమైన మాటలు, కోటేషన్స్‌తో అమ్మకు శుభాకాంక్షలు చెప్పేయండి..
[[{"fid":"208785","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"PC: Pixabay","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"PC: Pixabay","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"PC: Pixabay","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]
మన రేపటి బంగారు భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు అమ్మ.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు
‘ఎన్ని తరాలు మారినా.. యుగాలు మారినా.. మారని మాధుర్యం, వెలకట్టలేని సంపద అమ్మ ప్రేమ’ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు (Happy Mothers Day)
’సృష్టిలో మనకు తొలి గురువు అమ్మే. తల్లిని మించిన దైవం లేదు. ఆమె త్యాగాలకు అంతులేదు. అందుకే అమ్మకు శతకోటి వందనాలు’ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
‘ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నీకు ప్రేమను పెంచే వ్యక్తి అమ్మ మాత్రమేనని తెలుసుకో’. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
[[{"fid":"208786","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Happy Mothers Day 2021 (Representational Image)","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Happy Mothers Day 2021 (Representational Image)","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Happy Mothers Day 2021 (Representational Image)","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"2"}}]]
‘పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ..
పవిత్రమైన ప్రేమ అమ్మ.. అంతులేని అనురాగం అమ్మ..
అలుపెరుగని ఓర్పు అమ్మ...
అపురూపమైన కావ్యం అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ..
అరుదైన రూపం అమ్మ..’ అలాంటి అమ్మకు Happy Mothers Day
[[{"fid":"208787","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mothers Day 2021 Quotes (PC: Pixabay)","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mothers Day 2021 Quotes (PC: Pixabay)","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Mothers Day 2021 Quotes (PC: Pixabay)","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"3"}}]]
‘మనం చేసే ప్రతి పనిలోనే మంచిని వేతికే సహనశీలి, త్యాగమూర్తి మాతృమూర్తి ఒక్కరే’ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
‘అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆ త్యాగమూర్తి గురించి ఎంత మాట్లాడినా ఏదో తెలియని వెలితి.
అందుకే అమ్మ అని పేరుని మించిన గొప్ప పదం ఇంకేముంటుంది’ Happy Mothers Day 2021
‘కనిపించే దైవం అమ్మ. మనల్ని కనిపించే ధైర్యం, త్యాగం అమ్మ. ప్రేమలో ఆమెకు సాటిలేరెవ్వరు’ Happy Mothers Day 2021
[[{"fid":"208789","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mothers Day 2021 Wishes in Telugu (Representational Image)","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mothers Day 2021 Wishes in Telugu (Representational Image)","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Mothers Day 2021 Wishes in Telugu (Representational Image)","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"4"}}]]
‘బిడ్డకు వెలుగు పంచేందుకు తన జీవితాన్ని కొవ్వొత్తిలా ధార పోసే త్యాగశీలికి నిదర్శనం అమ్మ’... మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
నాన్నకైనా వారానికోసారి పని నుంచి విరామం దొరుకుతుంది. కానీ అమ్మకు ప్రతిరోజూ పిల్లలకు కావాల్సింది చేయడం, వారి బాగోగులు చూసుకోవడమే తెలుసు. అలిసిపోతున్నా పట్టించుకోకుండా కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయే గొప్ప స్వభావం అమ్మ నైజం. తన గురించి ఆలోచించుకునే సమయం, ధ్యాస ఉందని వ్యక్తి అమ్మ.. హ్యాపీ మదర్స్ డే.
[[{"fid":"208791","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mothers Day 2021 Wishes (Representational Image)","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mothers Day 2021 Wishes (Representational Image)","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Mothers Day 2021 Wishes (Representational Image)","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"5"}}]]
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook