Happy Valentine Day: వాలెంటైన్ డే చరిత్ర ఏంటి, ప్రేమికుడి త్యాగం లేదా ఇందులో..మరెందుకీ ప్రేమికుల రోజు
Happy Valentine Day: వాలెంటైన్ డే. ప్రేమికుల దినోత్సవంగా అందరికీ సుపరిచితమైన రోజు. ఇదేదో ఓ ప్రేమికుడి త్యాగానికి ప్రతీక కాదు. మరేంటి..ఎందుకు జరుపుకుంటున్నారు. వాలెంటైన్ డేలో ప్రేమికుడి పాత్ర ఉందా లేదా..ఆ ఆసక్తికరమైన కథ తెలుసుకుందామా..
Happy Valentine Day: వాలెంటైన్ డే. ప్రేమికుల దినోత్సవంగా అందరికీ సుపరిచితమైన రోజు. ఇదేదో ఓ ప్రేమికుడి త్యాగానికి ప్రతీక కాదు. మరేంటి..ఎందుకు జరుపుకుంటున్నారు. వాలెంటైన్ డేలో ప్రేమికుడి పాత్ర ఉందా లేదా..ఆ ఆసక్తికరమైన కథ తెలుసుకుందామా..
ప్రతి యేటా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే రోజు. ప్రేమికులందరికే కాదు ప్రేమ ఉన్న అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే. ప్రేమికుల రోజు అంటే కేవలం ప్రేమికుల మధ్యన జరుపుకునే రోజే కాదు. ఆశ్యర్యంగా ఉందా..నిజమే..వాలెంటైన్స్ డే విశేషం, సందర్భం, చరిత్ర తెలుసుకుంటే అదే తెలుస్తుంది మరి.
వాలెంటైన్ డే నేపధ్యం
ఇది క్రీస్తుశకం 270 సంవత్సరం నాటి ఘటన. రోమ్ దేశాన్ని క్లాడియస్ చక్రవర్తి పాలిస్తున్న రోజులు. క్లాడియస్‌కు పెళ్లి అంటే పడదు. పెళ్లిళ్లపై నిషేధం కూడా విధించాడు. అదే సమయంలో వాలెంటైన్ అనే ఓ మతగురువు అందరికీ ప్రేమ సిద్ధాంతాన్ని బోధించేవారు. అంటే లవ్‌గురు అన్నమాట. ప్రేమ సిద్ధాంతాన్ని బోధించడమే కాకుండా దగ్గరుండి పెళ్లిళ్లు చేయించేవాడు. పెళ్లిళ్లపై ద్వేషంతో నిషేధం విధించినప్పుడు కొత్తగా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువవడంతో క్లాడియస్ ఆరా తీయగా...లవ్‌గురు వాలంటైన్ వ్యవహారం కాస్తా రాజు చెవికి చేరింది. అందే ఆగ్రహంతో రాజద్రోహం ఆరోపణలపై మరణశిక్ష విధించాడు. జైళ్లో ఉండగా వాలెంటైన్ జైలు అధికారి కూతురితో ప్రేమలో పడతాడు. చనిపోయేంతవరకూ అంటే చివరి రోజైన ఫిబ్రవరి 14 వరకూ ప్రియురాలి గురించి తల్చుకుంటూ ఉంటాడు. యువర్ వాలెంటైన్ అంటూ ఓ లేఖ రాస్తాడు. అదే ఇప్పుడు నీ ప్రేమికుడిగా మారి..వాలెంటైన్ డే గా జరుపుకోడానికి కారణమైంది.
ఎందుకు వ్యతిరేకత
అయితే ఇండియాలో ఇటీవల వాలెంటైన్స్ డేను వ్యతిరేకించడం ఎక్కువైంది. 90 దశకం నుంచే ఇండియాలో వాలెంటైన్ డే జరుపుకుంటూ వస్తున్నారు. ఇది భారతదేశ సంస్కృతి కాదంటూ వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, శివసేన, భజరంగ్ దళ్ వంటి కొన్ని హిందూత్వ సంస్థలు రంగంలో దిగి..ఆందోళన చేస్తుంటాయి. ప్రేమికుల రోజంటే ఏదో ఓ ప్రేమికుడి త్యాగం కాదనే సంగతి చాలామందికి తెలియదు. ఇది కేవలం పెళ్లిళ్లంటే పడని ఓ రాజు..ప్రేమ పెళ్లిళ్లు చేయిస్తున్న వాలెంటైన్‌కు విధించిన శిక్ష కారణంగా ప్రాచుర్యంలో వచ్చింది. అంటే రాజాజ్ఞను శిరసావహించకపోవడంతో వచ్చిన సమస్య. వాస్తవానికి వాలెంటైన్‌కు పడిన ఉరిశిక్ష..అతడు ప్రేమికుడైనందుకు కాదు. పెళ్లిళ్లపై నిషేదాన్ని ఖాతరు చేయకపోవడమే.
వాలెంటైన్ ఒక రోజు కాదు...వారం
అందరికీ తెలిసిన వాలెంటైన్ డే (Valentine Day) వాస్తవానికి ఒకరోజు కానేకాదు. ఇది వారం రోజులపాటు జరుపుకునేది. ఏ రోజు ఏం జరుపుకుంటారనేది ఈ సందర్భంగా చూద్దాం. ఫిబ్రవరి 7 న ప్రారంభమయ్యే వాలెంటైన్ డే రోజ్ డేతో ప్రారంభమవుతుంది. 8వ తేదీన ప్రపోజ్ డే, 9వ తేదీన చాకొలేట్ డే, 10వ తేదీన టెడ్డీ డే, 11వ తేదీన ప్రామిస్ డే, 12వ తేదీన హగ్ డే, 13వ తేదీన కిస్ డే జరుపుకుంటూ...చివరి రోజు ప్రేమికుల రోజు జరుపుకుంటారు.
Also read: Hug Day 2022: నేడు హగ్ డే- మీ ప్రేమను ఇలా వ్యక్తపరచండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook