Beauty Tips: చర్మ నిగారింపు, అందం కావాలంటే బ్యూటీ క్రీమ్స్ అవసరం లేదు, ఇది తింటే చాలు
Beauty Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఎన్నో రకాల పోషకాలు దాగున్నాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండ్లలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది దానిమ్మ గురించి. దానిమ్మతో కలిగే ఆరోగ్యమే కాదు..అందాన్ని కూడా తీర్చిదిద్దుకోవచ్చు.
Beauty Tips: చాలామందికి పండ్లతో కలిగే పూర్తి ప్రయోజనాలు తెలియవు. ఫ్రూట్స్ అంటే కేవలం ఆరోగ్యానికే అనుకుంటారు. కానీ పండ్లతో ఆరోగ్యపరంగానే కాకుండా అందాన్ని కూడా పరి రక్షించుకోవచ్చు. మీ అందానికి మెరుగులు దిద్దవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
పండ్లలో దానిమ్మ చాలా ప్రత్యేకం. దాదాపు అందరూ నిస్సంకోచంగా తినగలిగే ఫ్రూట్ ఇది దానిమ్మలో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు అధికం. దానిమ్మ పండ్లను కేవలం ఆరోగ్యపరంగానే చాలామంది పరిగణిస్తుంటారు. అటు వైద్యులు కూడా బలహీనత దూరం చేసేందుకు దానిమ్మ పండ్లు తినమని సూచిస్తుంటారు. శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో దానిమ్మ పండ్లు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. అదే సమయలో చర్మ సంరక్షణలో కూడా దానిమ్మ పండ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. దానిమ్మను రోజూ క్రమం తప్పకుండా సేవించడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. చర్మం రంగు తేలుతుంది. చర్మ సంబంధిత చాలా సమస్యలు దూరమౌతాయి. పింపుల్స్, యాక్నే వంటి సమస్యలుంటే దానిమ్మ పండ్లతో దూరం చేసుకోవచ్చు.
దానిమ్మ గింజలతో మీ ముఖంపై స్క్రబ్ కూడా చేయవచ్చు. దానిమ్మ గింజల పేస్ట్‌ను మీ ముఖంపై రాయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. దానిమ్మ గింజల స్క్రబ్ తయారీ కూడా సులభమే. కొన్ని దానిమ్మ గింజల్ని రుబ్బుకోవాలి. ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపితే చాలు. ఇప్పుడీ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని కాస్సేపటి తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
దానిమ్మ గింజల జ్యూస్ కూడా ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడుతుంది. ఇందులో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఏజీయింగ్ సమస్య తగ్గుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీ ముఖంపై ముడతలు పడకుండా కాపాడుతుంది. రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ముఖానికి నిగారింపు కలుగుతుంది.
చర్మాన్ని అందంగా మార్చేందుకు హైడ్రేట్‌గా ఉంచేందుకు దానిమ్మ నూనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానిమ్మ నూనె రాయడం వల్ల ముఖంపై ముడతలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇందులో ఉండే ఒమేగా 5 ఫ్యాటీ యాసిడ్స్ , ఫైటోస్ట్రోల్ చర్మంలోని కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
Also read: Curd Food Combination: పెరుగుతో ఈ పదార్ధాలు తింటే మూల్యం చెల్లించుకోవల్సిందే..తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook