Watermelon Seeds Benefits: ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం రోజుకు ఒక పండ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా సీజన్‌లో లభించే ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా , చురుకుగా ఉంటుంది. అయితే వేసవికాలంలో ఎక్కువగా డిమాండ్‌ ఉన్న పుచ్చకాయ తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని తెలుసు. అయితే ఇందులో ఉండే గింజలను తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఈ గింజలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, వాటి ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం. పుచ్చకాయ గింజలలో అధిక శాతం ఎక్కువ పోషకాలు ఉంటాయి. 


పోషకాల పుష్కలం:


పుచ్చకాయ గింజలు పోషకాలకు పవర్ హౌస్‌. ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు A, B1, B6, C, E, మినరల్స్,  మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి పోషకాలను కలిగి ఉంటాయి. 


ఫైబర్‌కు కూడా మంచి మూలం, ఇది మీ జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. 


రోగనిరోధక శక్తిని పెంచుతుంది:


పుచ్చకాయ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్‌ నష్టం నుంచి కణాలను రక్షించడానికి సహాయపడతాయి.


అంతేకాకుండా, విటమిన్ సి మరియు జింక్ వంటి ఖనిజాలు ఇతర అనారోగ్యాలనుంచి పోరాటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. 


గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:


పుచ్చకాయ గింజల్లోని మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించడానికి , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. 


అంతేకాకుండా, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి మరియు చెడు కొలెస్ట్రాల్  స్థాయిలను తగ్గించడానికి కూడా అవి దోహపడతాయి. 


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:


పుచ్చకాయ గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.


అంతేకాకుండా, పేగు లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగును పెంచుతుంది. 


పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వల్ల మీ శరీరం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండానికి మీరు ఈ గింజలను మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు అంటున్నారు. 


Also Read: Sprouts Dosa: కేవలం రెండు నిమిషాల్లో తయారు చేసుకొనే మొలకల దోశ !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter