Mushrooms Benefits: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. అవేంటో తెలిస్తే ఇప్పుడే తినడం మెుదలుపెడతారు..
Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మష్రూమ్ తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Mushrooms Benefits: భారతదేశంలోని ప్రజలు పుట్టగొడుగులను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటారు. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్లతోపాటు వ్యాధుల రాకుండా చేయడంతో ఇవీ అద్భుతంగా పనిచేస్తాయి. పుట్టగొడుగులు (Health benefits of mushrooms) తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి లుక్కేద్దాం.
పుట్టగొడుగుల ప్రయోజనాలు
** ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఆహారంలో భాగంగా.. పుట్టగొడుగులను తీసుకుంటే వాటికి చెక్ పెట్టవచ్చు.
** మీ చర్మం పొడిబారిపోతుంటే.. అలాంటి వారు మష్రూమ్స్‌ను తీసుకోవడం వల్ల స్కిన్ మృదువుగా మరియు కాంతివంతంగా ఉంటుంది.
** పుట్టగొడుగుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. దీనిని పుడ్ లో భాగంగా తీసుకుంటే మీరు బరువు తగ్గుతారు.
** మష్రూమ్స్‌ను తినడం వల్ల మీ ప్రేగులు క్లీన్ అవుతాయి. ఇది కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
** పుట్టగొడుగులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు మలబద్దకం దూరమవుతుంది.
** మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరియు అధిక రక్తపోటు ఉన్నవారికి పుట్టగొడుగు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి.
** పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Banana Side effects: ఓరి నాయనో! అరటి పండు ఎక్కువగా తింటే ఇన్ని నష్టాలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook