Blood Pressure: ఆధునిక జీవనశైలిలో చాలామందిలో సర్వ సాధారణంగా కన్పించే సమస్య అధిక రక్తపోటు. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోతే వచ్చే సమస్య ఇది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత పోటీ ప్రపంచంలో జీవనశైలి పూర్తిగా మారిపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇలా వివిధ కారణాలతో పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కన్పిస్తున్నది అధిక రక్తపోటు సమస్య. అధిక రక్తపోటు అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత కొంపముంచుతుంది


గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా అయ్యే సమయంలో ధమనులు సంకోచిస్తే..అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. కానీ జీవనశైలిలో మార్పులతో అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.  అధిక రక్తపోటు నుంచి విముక్తి పొందేందుకు ఏం చేయాలో చూద్దాం..


స్థూలకాయమనేది చాలా సమస్యలకు మూలకారణం. స్థూలకాయం ఉన్నప్పుడు కచ్చితంగా అధిక రక్తపోటు ఉంటుంది. అధిక బరువుండేవారికి..తక్కువ బరువుండేవారితో పోలిస్తే బ్లడ్ ప్రెషర్ సమస్య ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు తగ్గించాలంటే ముందు..బరువు తగ్గించాలి.


చెడు జీవనశైలిలో భాగమైన మద్యం తాగడం మరో కారణం. రోజూ మద్యం తాగుతుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మద్యం అనేది బ్లడ్ ప్రెషర్ పెంచేందుకు ఓ కారణం. రోజూ మద్యం తాగే అలవాటుంటే ఇవాళ్టి నుంచే మానేయడం మంచిది.


ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగాల్ని దూరం చేయవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతుంటే క్రమంగా తప్పకుండా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల యాక్టివ్‌గా ఉండటమే కాకుండా..బరువు తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే బరువు తగ్గుతారో..రక్తపోటు తగ్గుతుంది. కొంతమందిలో మాత్రం అధిక బరువు లేకపోయినా అధిక రక్తపోటు సమస్య ఉంటుంది. 


Also read: Weight Loss Tips: బరువు తగ్గే డైట్‌లో రోటీ తీసుకోవడం మంచిదా.. బ్రెడ్‌ తీసుకోవడం మంచిదా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok