Beauty Benefits of Peanuts: వేరుశెనగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది చలికాలంలో వేరుశెనగను వేయించుకుని లేదా ఉడకబెట్టి తింటారు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, గుండె జబ్బుల రాకుండా అడ్డుకోవడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. వేరుశెనగలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వేరుశెనగ తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. వేరుశెనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేరుశెనగ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
యాంటీ ఏజింగ్: వేరుశెనగలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ముఖంపై ముడతలు రాకుండా, వృద్ధాప్య దరిచేరకుండా ఉండటంలో సహాయపడతాయి. 
చర్మానికి నిగారింపు: వేరుశెనగలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మానికి నిగారింపు ఇవ్వడంలో అద్భుతంగా పనిచేస్తుంది.  
మొటిమలకు చెక్: వేరుశెనగలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మొటిమలు తగ్గించడంలో ఇవి అద్బుతంగా సహాయపడతాయి.  
స్కిన్ కు రక్షణ: వేరుశెనగలో విటమిన్ ఇ ఉంటుంది. హానికరమైన UV కిరణాల ప్రభావాన్ని  నుండి చర్మాన్ని రక్షిస్తుంది. 
యవ్వనంగా ఉండేలా చేస్తుంది: వేరుశెనగలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా మీరు యవ్వనంగా ఉంటారు.  
చర్మానికి మృదుత్వం: వేరుశెనగ నూనె ఒక గొప్ప సహజమైన మాయిశ్చరైజర్. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
నల్లటి వలయాలను తగ్గిస్తుంది: వేరుశెనగలో ఉండే అధిక స్థాయిలో విటమిన్ కె మరియు కొవ్వు ఆమ్లాలు నల్లటి వలయాలను తగ్గిస్తాయి.


Also Read: Skin Care Tips: వయస్సు 30 ఏళ్లు దాటినా అందంగా, ఫిట్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook