Weight Loss Diet: వేగంగా బరువు తగ్గాలంటే ఈ 5 రూట్ వెజిటబుల్స్ తప్పక తినాల్సిందే
Weight Loss Diet: ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం లేదా అధిక బరువు అతిపెద్ద సమస్యగా మారింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు కావచ్చు డైటిషియన్లు కావచ్చు పదే పదే చెప్పే మాట.
Weight Loss Diet: మనిషి ఎప్పుడూ ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండటం అన్ని విధాలా మంచిది. స్థూలకాయం లేదా అధిక బరువుతో ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే స్థూలకాయం సమస్యకు ఎప్పటికప్పుడు చెక్ చెప్పేందుకు ప్రయత్నించాలి. సాధ్యమైనంతవరకూ ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది.
అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు. వాకింగ్, డైటింగ్, వ్యాయామం ఇలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రోజూ నిర్ణీత సమయంలో వ్యాయామంతో పాటు డైట్‌లో కొన్ని రకాల ఆహార పదార్ధాలు తప్పుకుండా ఉండేట్టు చూసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు వేగంగా తగ్గేందుకు కూరగాయలు అద్భుతంగా దోహదపడతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. స్థూలకాయాన్ని నియంత్రణలో ఉంచకపోతే గుండె వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వెంటాడుతాయి. శరీరాన్ని డొల్లగా మార్చేస్తాయి. రోజూ తగినంత నిద్ర, నీళ్లు, సరైన డైట్ అవసరమౌతాయి.
బరువు నియంత్రించేందుకు ముఖ్యంగా రూట్ వెజిటబుల్స్ అంటే భూమి అంతర్భాగంలో పండేవి అద్భుతంగా ఉపయోగపడతాయని పరిశోధకులు తేల్చారు. ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు, ఫైబర్ కారణంగా డయాబెటిస్, కొలెస్ట్రాల్ అదుపులో రావడమే కాకుండా బరువు నియంత్రణలోకి వస్తుంది.
రూట్ వెజిటబుల్స్‌లో ప్రధానంగా చెప్పుకోవల్సింది చిలకడ దుంప. ఇందులో అన్ని రకాల విటమిన్లు, ఫైబర్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తాయి. ఆకలిని నిరోధిస్తాయి. రెడ్ ముల్లంగి కూడా మరో కీలకమైన కూరగాయ. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ . అందుకే డైట్‌లో రెడ్ ముల్లంగి భాగంగా చేసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.
రూట్ వెజిటబుల్స్‌లో మరొక ముఖ్యమైంది బీట్‌రూట్. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గించి శరీరం సామర్ధ్యాన్ని పెంచుతుంది. బీట్‌రూట్ బరువు నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. క్యారట్ కంటిచూపుకు అద్భుతంగా పనిచేస్తుందని అందరికీ తెలుసు. అదే సమయంలో ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు నియంత్రణ ప్రక్రియలో కీలకంగా ఉపయోగపడగలదు.
టర్నిప్ కూడా స్థూలకాయం తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ ఎెక్కువ, కేలరీలు తక్కువ. అందుకే వెయిట్ లాస్ ప్రక్రియలో ఉపయోగిస్తారు. బీట్‌రూట్, క్యారట్, కీరా మిశ్రమంతో జ్యూస్ తయారు చేసుకుని రోజూ పరగడుపున లేదా సాయంత్రం పూట తాగినా మంచి ఫలితాలుంటాయి. బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్త హీనత సమస్య ఉత్పన్నం కాదు.
Also read: Dates Benefits: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు చలి కాలంలో తప్పకుండా ఖర్జూరాను తీసుకోవాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook